Janasena: వైసీపీ నేతలు పాలన వదిలేసి పవన్ పైనే దృష్టి పెట్టారంటున్న నాగబాబు.. మోడీతో సమావేశంపై ఆవేదన ఎందుకని ప్రశ్న

|

Nov 15, 2022 | 12:40 PM

పవన్ కల్యాణ్ ఏది మాట్లాడినా పదిసార్లు ఆలోచించి మాట్లాడతారన్నారు జనసేన నేత నాగబాబు. పాలన గాలికొదిలేసి పవన్ ప్రధాని మోదీతో ఏం మాట్లాడారోనని.. మంత్రులు ఎందుకు ఆవేదన చెందుతున్నారని ప్రశ్నించారు. జనసేన ప్రభుత్వం వచ్చాక అన్ని లెక్కలు బయటకు తీస్తామని హెచ్చరించారు.

Janasena: వైసీపీ నేతలు పాలన వదిలేసి పవన్ పైనే దృష్టి పెట్టారంటున్న నాగబాబు.. మోడీతో సమావేశంపై ఆవేదన ఎందుకని ప్రశ్న
Janasena Pac Nagababu
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఇప్పుడే వస్తున్నాయా అనిపిస్తుంది తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే. అసలే వైసీపీ నేతలు జనసేన నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో కొనసాగుతుంటే.. అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ప్రధాని మోడీతో భేటీ అయిన తర్వాత మరింత ఎక్కువైంది. వైసీపీ మంత్రులు, నేతలు పవన్ కళ్యాణ్ పై జనసేన పార్టీ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ్ముడుకు అండగా అన్నయ్య సోషల్ మీడియా వేదికగా తన గళం విప్పాడు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంటే ఏపీ మంత్రులకు అంత భయం ఎందుకని నాగబాబు జనసేన పి.ఏ.సి సభ్యులు ప్రశ్నించారు. పూర్తి పరిజ్ఞానం లేని ఏపీ మంత్రులకు స్క్రిప్టు అందించినట్లే అందరికీ అందిస్తారని భ్రమ పడుతున్నట్లుందని విమర్శించారు.

పవన్ కల్యాణ్ ఏది మాట్లాడినా పదిసార్లు ఆలోచించి మాట్లాడతారన్నారు జనసేన నేత నాగబాబు. పాలన గాలికొదిలేసి పవన్ ప్రధాని మోదీతో ఏం మాట్లాడారోనని.. మంత్రులు ఎందుకు ఆవేదన చెందుతున్నారని ప్రశ్నించారు. జనసేన ప్రభుత్వం ఏర్పడిని తర్వాత జగన్ పాలనలోని అవినీతి లెక్కలు అన్నీ బయటకు తీస్తామని హెచ్చరించారు.

అయినా ఏపీ మంత్రులు పరిపాలన గాలికొదిలేసి పవన్ కళ్యాణ్ ఎవరితో, ఏం మాట్లాడారోనని నిరంతరం ఆలోచిస్తున్నారని.. అయినా మంత్రులు ఎందుకు ఆవేదన చెందుతున్నారో వారికే తెలియాలని వ్యాఖ్యానించారు.  ప్రధాన మంత్రి మోడీ..  పవన్ కళ్యాణ్ పై ఉన్న గౌరవంతో ఆహ్వానించి మర్యాదపూర్వకంగా మాట్లాడిన మాటలు కూడా విడమరచి చెప్పాలని వైసీపీ మంత్రులు అడగడం వెనుక భయమో, అభద్రతా భావమో కూడా వారికే అర్థం కావాలన్నారు.

ఇవి కూడా చదవండి

ఏపీలో జగన్ ప్రభుత్వం చేపట్టిన జగన్న కాలనీ పథకం అవినీతి మయమని నాగబాబు ఆరోపించారు. తమ పార్టీ అధికారలోకి వచ్చాకా జె గ్యాంగ్ అవినీతి లెక్కలన్నీ బయటికి తీస్తామని నాగబాబు వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..