
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసేందుకు వస్తోన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన విజయవాడ రావడానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎన్టీఆర్ జిల్లా ఆనుమంచిపల్లి పవన్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పవన్ కారు నుంచి బయటకు వచ్చి రోడ్డుపై నిరసన తెలిపారు. నడి రోడ్డుపైనే పడుకున్నారు. దాంతో పోలీసులు ఆయనకు సర్ధి చెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. అనంతరం కాలినడకన విజయవాడకు పయనమయ్యారు. ఆయన వెంట నాదెండ్ల మనోహర్‌తో పాటు జనసేన పార్టీ నాయకులు, కార్త్యకర్తలు భారీగా ఉన్నారు.
మరోవైపు పోలీసులు జనసేన అధ్యక్షుడిని అడ్డుకోవడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ‘ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ కారణం లేకుండా, పోలీసులే అల్లరి మూకల మాదిరిగా రోడ్డుకి అడ్డంపడి పవన్ కళ్యాణ్ గారిని కదలనివ్వకుండా చేయడం దారుణం. రాజకీయ నేతలని అక్రమంగా నిర్బంధించడం రాజ్యాంగ విరుద్ధం. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. ఎమర్జెన్సీ కంటే ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు’ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్. మొత్తానికి పవన్ కల్యాణ్ పర్యటనతో బోర్డర్‌లో హై టెన్షన్ నెలకొంది.
అనుమంచిపల్లి వద్ద రోడ్డుపై బైఠాయించిన జనసేనాని, మంగళగిరి కార్యాలయం వెళ్లి తీరుతానని @PawanKalyan గారి నిర్ణయం#HelloAP_ByeByeYCP pic.twitter.com/QU0V6iGYDj
— JanaSena Party (@JanaSenaParty) September 9, 2023
— Manohar Nadendla (@mnadendla) September 9, 2023
” అనుమంచిపల్లిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారితోపాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కూడా అదుపులోకి తీసుకున్న ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు
* పోలీసు వాహనంలో తీసుకు వెళ్తున్నారు
* ఎక్కడకి అనే సమాచారం ఇవ్వని పోలీసులు— JanaSena Party (@JanaSenaParty) September 9, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..