Pawan – Chandrababu Meet: కాసేపట్లో చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్.. ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలు..

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రస్తుత పరిణామాల మధ్య.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కానుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Pawan - Chandrababu Meet: కాసేపట్లో చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్.. ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలు..
Pawan Chandrababu Meet

Updated on: Jan 08, 2023 | 11:27 AM

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రస్తుత పరిణామాల మధ్య.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ కానుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాసేపట్లో చంద్రబాబు ఇంటికి పవన్‌ కల్యాణ్‌ రానున్నారు. చంద్రబాబుతో పలు విషయాలపై పవన్‌కల్యాణ్‌ సుధీర్ఘంగా చర్చించనున్నారు. తాజాగా, జరిగిన ఏపీ రాజకీయ పరిణామాలు, వచ్చే ఎన్నికల్లో పొత్తులు తదితర విషయాలపై ఇద్దరు నేతలు సంభాషించనున్నట్లు తెలుస్తోంది.

ఏపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన రోడ్‌షోల రద్దు జీవో, ఆంక్షలపై ఇరు పార్టీల నేతలు చర్చించనున్నారు. దీంతోపాటు ఇటీవల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను కూడా చర్చించనున్నారని తెలుస్తోంది. చంద్రబాబు కుప్పం పర్యటనలో పోలీసుల ఆంక్షలు, తదితర విషయాలపై కూడా మాట్లాడనున్నారు.

గతంలో పవన్‌ విశాఖ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అప్పుడు పవన్‌ను కలిసి చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఇప్పుడు కుప్పం పర్యటన తర్వాత చంద్రబాబు ఇంటికి పవన్‌ కల్యాణ్‌ వస్తుండంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి.

ఇవి కూడా చదవండి

ఈనెల 12న శ్రీకాకుళంలో జనసేన యువశక్తి సభ గురించి కూడా చర్చించనున్నారు. ఆ కార్యక్రమామానికి పోలీసులు విధించిన పలు ఆంక్షలపై ఇప్పటికే జనసేన అభ్యంతరం వ్యక్తంచేసింది. విపక్షాలను ప్రభుత్వం టార్గెట్ చేస్తోందంటూ టీడీపీ, జనసేన వైఎస్ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి.

ఈ క్రమంలో ప్రభుత్వం విధానాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించడంతోపాటు ముందస్తు ఎన్నికలపైనా చర్చిస్తారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం..