Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు తీవ్ర జ్వరం.. వారాహి యాత్రకు విరామం.. మళ్లీ ప్రారంభం అప్పుడే
జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. దీంతో వారాహి విజయ యాత్రకు రెండు రోజులు విరామం ప్రకటించారు పవన్. ప్రస్తుతం భీమవరం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్‌లో పవన్ కల్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నారు.
జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. దీంతో వారాహి విజయ యాత్రకు రెండు రోజులు విరామం ప్రకటించారు పవన్. ప్రస్తుతం భీమవరం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్‌లో పవన్ కల్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. తిరిగి ఈ నెల 30న అంబేద్కర్ సెంటర్లో సభతో పవన్ వారాహి యాత్ర ప్రారంభం కానుంది. కాగా గత వారం రోజుల నుంచి వారాహి విజయ యాత్రలో బిజీబిజీగా ఉంటున్నారు పవన్. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాను చుట్టేసిన ఆయన ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. అవిశ్రాంతంగా సభలు, సమావేశాల్లో పాల్గొనడంతోనే పవన్ ఆరోగ్యం దెబ్బతినిందని తెలుస్తోంది. ఇక ఆరోగ్యం బాగోలేకపోయినా మంగళవారం (జూన్ 27) భీమవరం పార్టీ నేతలతో సమావేశమయ్యారు జనసేన అధినేత. పార్టీ పటిష్ఠతపై సమాలోచనలు చేశారు. ఈ సందర్భంగా భీమవరం సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఇక్కడ ఉపాధి లేక ఉత్తరాంధ్ర నుంచి తూర్పుకాపులు వలస బాటపట్టారన్నారు దేశంలో ఎక్కడ ఏ నిర్మాణం జరుగుతున్నా దాని వెన్నెముక తూర్పుకాపులై ఉంటారన్నారు పవన్. 52 శాతం మంది బీసీలుంటే…వారిలో ఉత్తరాంధ్ర నుంచి ఉన్న బీసీల్లో అత్యధిక మంది తూర్పుకాపులేనన్నారు. ఉత్తరాంధ్ర జనం సాహసికులన్నారు పవన్ కల్యాణ్. తూర్పుకాపుల్లో బలమైన రాజకీయ నేతలు ఉన్నారు. తెలంగాణలో కొందరిని బీసీ కులాల జాబితాలో నుంచి తీసేశారని ఆరోపించారు. అప్పుడు ఏ ప్రజాప్రతినిధీ ఈ అన్యాయాన్ని ప్రశ్నించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనతో కాపులు తీవ్రంగా నష్టపోయారన్నారు పవన్. బీసీ జనాభా 26 లక్షలున్నారని టీడీపీ ప్రభుత్వం ప్రకటిస్తే…వైసీపీ దాన్ని సగానికి తగ్గించిందన్నారు పవన్ కల్యాణ్. బీసీ జనాభా 16 లక్షలేనని చెపుతోందని ఆరోపించారు. ఏ ప్రాతిపదికన ప్రభుత్వాలు జనాభాని నిర్ణయిస్తాయని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. పథకాలు అమలు చేయకుండా తప్పించుకునేందుకే ఈ కోత అన్నారు. రాష్ట్రంలోనే బీసీలకు జరుగుతోన్న అన్యాయాన్ని ప్రశ్నించే నాయకులు కావాలన్నారు పవన్ కల్యాణ్. బీసీ గణాంకాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు పవన్ కల్యాణ్. అధికారంలోకి వచ్చాక గణాంకాలు వెలికితీస్తామని స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..