రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన రైల్వే లైన్ల నిర్మాణం, విస్తరణలపై ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఇచ్చిన వివరణతో రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల్లో ఎందుకు జాప్యం జరుగుతుంతో తెలుస్తోందని.. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి తేటతెల్లమైందని ఆయన మండిపడ్డారు. కేంద్ర రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు ఏపీ ప్రభుత్వం అలక్ష్యం కారణంగానే ఆలస్యమవుతున్నాయని, ఏపీ ప్రభుత్వం తన వాటాగా నిధులు మంజూరు చేయకపోతే ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయని ప్రశ్నించారు. ఈమేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ రాష్ట్రంలో కీలకమైన రైల్వేలైన్లు అసంపూర్తిగా ఉండిపోయాయి. కోటిపల్లి- నరసాపురం రైల్వే లైన్ పనులు ఎక్కడ వేసిన గొంగడి మాదిరిగా అలాగే ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు తన వాటాగా 25 శాతం నిధులు సమకూర్చాలి. అయితే ఆ మొత్తాన్ని మంజూరుచేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.358 కోట్లు ఇస్తేనే ఈ పనులు ముందుకు సాగుతాయి. ఈ రైల్వే లైన్ పూర్తి చేస్తే ఉభయగోదావరి జిల్లాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.’
అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది?
‘ఈ ప్రాజెక్టుతో పాటు చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి- నడికుడి ప్రాజెక్టకు రూ.1,351 కోట్లు, కడప- బెంగళూరు రైల్వే లైన్‌కు రూ. 289 కోట్లు, రాయదుర్గం- తమకూరు లైన్‌కు రూ. 34 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. రైల్వే పనులకు నిధులు ఇవ్వరు. భూసేకరణ చేయరు. ఈ విషయాల్లో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయి? రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది?’ అని పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఎంపీలు సీఎం దృష్టికి తీసుకెళ్లాలి..
రాష్ట్రంలో రైల్వే లైన్ల పూర్తికావడానికి పార్లమెంట్ లో కేంద్ర రైల్వే శాఖ చెప్పిన అంశాలను ఎంపీలు తమ సీఎం దృష్టికి తీసుకెళ్లాలని జనసనే అధినేత సూచించారు. ‘విశాఖ రైల్వే జోన్ ప్రకటన పూర్తయినా దానికి కార్యరూపం దాల్చడంలో ఎంపీలు విఫలమవుతున్నారు. రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో ఎంపీలు బాధ్యతగా వ్యవహరించాలి. ప్రకటించిన జోన్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఇందుకోసం కేంద్ర రైల్వే శాఖ చెప్పిన అంశాలను ఎంపీలు సీఎం దృష్టికి తీసుకెళ్లాలి. రైల్వేప్రాజెక్టులకు నిధులు విడుదలచేయించాలి’ అని ఎంపీలకు సూచించారు పవన్.
Also Read:Samyuktha Menon: కారు డ్రైవ్ చేస్తూ లాలా భీమ్లా సాంగ్ ను ఎంజాయ్ చేసిన ముద్దుగుమ్మ.. టేక్ కేర్ అని సూచించిన నెటిజన్లు..
Lata Mangeshkar: లతాజీ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు.. గాన కోకిలకు నివాళి అర్పించిన ఐరాస..
Janagaon news: జనగామలో మళ్లీ ఉద్రిక్తత.. బీజేపీ, టీఆర్ఎస్ నేతల బాహాబాహీ