Pawan Kalyan: ఓటమి భయంతోనే జగన్ సర్కార్ కొత్త నాటకం.. మరో బిల్లు తెస్తామంటూ గందరగోళంః జనసేనాని
Pawan Kalyan: నవ్యాంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల బిల్లు రద్దు అని సీఎం జగన్ తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ..
Pawan Kalyan: నవ్యాంధ్రప్రదేశ్ కు మూడు రాజధానుల బిల్లు రద్దు అని సీఎం జగన్ తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి జగన్హై కోర్టు నుంచి తప్పించుకోడానికి హడావిడి నిర్ణయని అన్నారు. అంతేకాదు.. సీఎం జగన్ రెడ్డి బిల్లు రద్దు అంటూనే.. మరింత స్పష్టతతో కొత్త బిల్లును తెస్తామని చెప్పి గందరగోళంలోకి నెట్టేశారని చెప్పారు. అంతేకాదు ఏపీకి రాజధానికి సంబంధించి హైకోర్టులో 54 కేసులు విచారణ జరుగుతున్నాయని.. ఇక తమ ప్రభుత్వానికి హైకోర్టులో ఓటమి తప్పదని వైసీపీ సర్కార్ నిర్ణయించుకుందని.. అందుకనే తాత్కాలికంగా కోర్టు నుంచి తప్పించుకోడానికి జగన్ సర్కార్ మూడు రాజధానుల ప్రతిపాదనని రద్దు చేసినట్లు ప్రజలు భావిస్తున్నారని జనసేనాని చెప్పారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఏడున్నర ఏళ్ళు అవుతున్నా రాజధాని ఎక్కడుంటుందో తెలియని స్థితికి ఈ పాలకులు తీసుకువచ్చారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. వికేంద్రీకరణతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని వివిధ రాష్ట్రాలను ఉదాహరణగా చూపిస్తూ.. చిలకపలుకు పలుకుతున్న పాలకులు ఒక్క సంగతి తెలుసుకోవాలని.. మీరు ఉదాహరణగా చూపిస్తున్న ఏ రాష్ట్రంలోనూ రెండు మూడు రాజధానులు లేవన్న సంగతిని విస్మరించాదని అన్నారు పవన్ కళ్యాణ్.
మూడు రాజధానులు ఏర్పాటుతోనే అభివృద్ది వికేంద్రీకరణ జరుగుతుందన్న భ్రమలోనే వై.సి.పి. పెద్దలు మునిగి తేలుతున్నారని ఎద్దేవా చేశారు. రాజధానిపై శాసనసభలో ప్రతిపక్ష నేతగా పాల్గొని ప్రసంగించిన జగన్.. తాను ప్రతిపక్షనేతగా ఆనాడు ఏమి చెప్పారో అందుకు భిన్నంగా నేడు మాట్లాడుతున్నారని అన్నారు.
రాజధాని కోసం రోడ్డెక్కిన రైతులను మందడం, రాయపూడి, చదలవాడ లాంటి చోట్ల లాఠీ ఛార్జీలు చేసి భయోత్పాతానికి గురి చేశారు. అనేకాదు రాజధాని కోసం భూములిచ్చిన రైతులపై 3వేలకు పైగా కేసులు పెట్టారు. మహిళలపై కూడా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారని అన్న జనసేనాని.. ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేశారు. తాత్కాలిక ప్రయోజనంతో కాకుండా దూరదృష్టితో రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్న సంపూర్ణ రాజధాని ఆవిర్భావానికి జగన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read: పాడేరులో బుసలు కొట్టిన నాగుపాము.. భయంతో పరుగులు తీసిన జనం..