Snake Hulchul: పాడేరులో బుసలు కొట్టిన నాగుపాము.. భయంతో పరుగులు తీసిన జనం..
Snake Hulchul: చల్లదనం ఉంటే చాలు పాములు బయటకు వచ్చి సేద తీరడానికి చూస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లోనే గ్రామస్థులు తగిన జాగ్రత్తలు..
Snake Hulchul: చల్లదనం ఉంటే చాలు పాములు బయటకు వచ్చి సేద తీరడానికి చూస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లోనే గ్రామస్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. తాజాగా విశాఖ ఏజెన్సీ నాగుపాము ఓ ఇంట్లో హల్ చల్ చేసింది. వివరాల్లోకి వెళ్తే..
విశాఖ ఏజెన్సీ పాడేరు లో నాగుపాము ఇంట్లో హల్ చల్ చేసింది. పాత పాడేరు లో ఓ ఇంట్లో కి చొరబడిన పాము.. బుసలు కొట్టింది. దీంతో జనం భయంతో పరుగులు తీశారు. సమాచారాన్ని స్నేక్ క్యాచర్ కు అందించారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ వాసు .. నాగు పాము ని పట్టుకుని అడవిలో వదలిపెట్టారు. అసలే కొండలు, గుట్టలు, అడవులు ఉండే ఏజెన్సీ ఏరియా.. ప్రస్తుతం వర్షాలు పడడంతో పొలాల గట్లు, రాళ్లు, పుట్టలు వంటి ప్రదేశాల్లో ఉన్న పాములు బయటకు వచ్చి సంచరిస్తుంటాయి. ఇటీవల కాలంలో నివాసాల్లో పాముల బెడద ఎక్కువైందని చెప్పారు.
ఇదే విషయంపై వైద్య నిపుణులు స్పందిస్తూ పాము కనిసించిన సందర్భంలో కాటుకు గురికాకుండా ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలేమిటి.. అసలు పాము కనిపిస్తే భయపడకుండా ఏవిధమైన చర్యలు తీసుసుకోవాలి అన్న అంశాలపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. పాము కరిస్తే ఏవిధంగా స్పందించాలి అన్న అవగాన లేకపోవడంతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఎవరినైనా పాము కరిస్తే ముందుగా అది విషపూరితమైనదో కాదో గుర్తించాలి.. గంటలోపు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి తగిన చికిత్సనందిస్తే ప్రాణాపాయం తప్పుతుందని చెప్పారు. నాటు వైద్యం జోలికి వెళితే అపాయం కొని తెచ్చుకున్నట్లేనని నిపుణులైన వైద్యులు హెచ్చరిస్తున్నారు.