Andhra Pradesh: మరికాసేపట్లో వారి అకౌంట్లో డబ్బులు జమ.. బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్..

|

Jul 18, 2023 | 1:58 PM

చిరు వ్యాపారులకు చేయూతనందించే లక్ష్యంతో తీసుకువచ్చిన ‘జగనన్న తోడు’ పథకం ఏడో విడత కార్యక్రమాన్ని ఇవాళ సీఎం జగన్ ప్రారంభించనున్నారు. తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీస్ నుంచి సీఎం జగన్ ఈ పథకం ఏడోవిడత నిధులను విడుదల చేయనున్నారు.

Andhra Pradesh: మరికాసేపట్లో వారి అకౌంట్లో డబ్బులు జమ.. బటన్ నొక్కి నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్..
CM Jagan
Follow us on

చిరు వ్యాపారులకు చేయూతనందించే లక్ష్యంతో తీసుకువచ్చిన ‘జగనన్న తోడు’ పథకం ఏడో విడత కార్యక్రమాన్ని ఇవాళ సీఎం జగన్ ప్రారంభించనున్నారు. తాడేపల్లి సీఎం క్యాంపు ఆఫీస్ నుంచి సీఎం జగన్ ఈ పథకం ఏడోవిడత నిధులను విడుదల చేయనున్నారు. 5,10,412 మందికి ప్రభుత్వం మరో విడత వడ్డీ లేని 549.70 కోట్ల రుణాలను అందజేయడంతో పాటు గతంలో ఈ పథకం ద్వారా రుణాలు పొంది, సకాలంలో చెల్లించిన వారికి 11.03 కోట్ల వడ్డీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు మొత్తం రూ. 2,955.79 కోట్ల రుణ సాయం చేశారు.

‘జగనన్న తోడు’ పథకం ద్వారా ఇప్పటికే 6 విడతలుగా చిరు వ్యాపారులకు ప్రభుత్వం రుణాలు అందజేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు 7వ విడత రుణాలు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాగా, ఒక విడత రుణం తీసుకొని తిరిగి చెల్లించిన వారికి వారి వడ్డీ మొత్తాన్ని ఎప్పటికప్పుడు ఆయా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లోనే ప్రభుత్వం నేరుగా జమ చేస్తోంది. తొలుత రుణం తీసుకుని, నిర్ణీత కాల వ్యవధిలో చెల్లించిన లబ్ధిదారులకు తిరిగి ఇచ్చే రుణాన్ని పెంచి మళ్లీ కొత్తగా రుణాలను అందిస్తోంది. కాగా, జగనన్న తోడు పథకం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 15,87,492 మంది లబ్ధి పొందారు. ఆరు విడతల్లో రూ. 2406.09 కోట్ లరుణాలను అందజేయగా.. తాజా రుణాలతో కలిపి రూ. 2,955 కోట్లు లబ్దిదారులకు అందజేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..