Andhra Pradesh: మీ గుండెలకు జగనన్న భరోసా.. హార్ట్ అటాక్ వస్తే.. గోల్డెన్ అవర్‌లో 40 వేల ఇంజక్షన్
నేటి యువ భారతం గుండె దడతో అల్లాడుతోంది. ఒకప్పుడు గుండెపోటు 50 ఏళ్లు పైబడిన వారిలో వచ్చేది. కానీ.. ఇప్పుడు పాతికేళ్లలోపు వాళ్లను కూడా గుండెపోటు మృత్యు ఒడిలోకి చేరుస్తోంది. ఇప్పుడు వరుసగా సడన్ హార్ట్ అటాక్‌లు అందర్నీ షాక్‌కి గురి చేస్తున్నాయి. దేశంలో గుండె, ఊపిరితిత్తుల సంబంధిత మరణాలు.. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా సంభవిస్తున్నాయి. గుండె.. ఉండేది మనిషి గుప్పెడంత. కానీ, నిలువెత్తు మనిషి ప్రాణం దాని మీదే ఆధారపడి ఉంటుంది. అయితే మారుతున్న లైఫ్‌స్టైల్.. ఆహారపు అలవాట్లు మనిషిని నిలబెట్టే ఆ బలాన్ని.. బలహీనపరుస్తున్నాయి. అందుకే గుండె సమస్యలతోపాటు కార్డియాక్ అరెస్ట్‌లతో.. వయసుతో సంబంధం లేకుండా ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు.
అమరావతి, ఆగస్టు 15: ఈ మధ్య కాలంలో గుండెపోట్లు పెరిగిన విషయం తెలిసిందే. ఒత్తిడి, మానసిక ఆందోళన, జీవన విధానంలో మార్పులు… కోవిడ్ తదనంతర పరిణామాలు.. కారణం ఏదైతేనేం.. హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ పెరిగాయి. ఈ ధోరణికి గల కారణాలు తెలుసుకునేందుకు ప్రజంట్ రీసెర్చ్‌లు జరుగుతున్నాయి. పిల్లలు, టీనేజర్స్, యువత కూడా గుండెపోట్ల బారిన పడటం.. ప్రాణాలు విడవడం పట్ల వైద్య నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గుండెపోటు చికిత్సలపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇటీవల పెరుగుతున్న గుండెపోటు మరణాల నివారణకు కొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. STEMI పేరుతో గుంటూరు, విశాఖ, కర్నూలు, చిత్తూరుల్లో కొత్తగా పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారభించింది. గుండెపోటు వచ్చిన తొలిగంట గోల్డెన్ అవర్ కావడంతో ఆ సమయంలో చికిత్సపై ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ ఆస్పుత్రుల్లో STEMI పేరుతో ప్రత్యేక చికిత్సా కేంద్రాన్ని ప్రవేశపెట్టింది. గోల్డెన్ అవర్‌లో ప్రాణాలు నిలిపే 40వేల విలువ చేసే ఇంజక్షన్ ఉచితంగా అందించనుంది. పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలను బట్టి మిగతా అన్ని జిల్లాల్లో ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సిబ్బందికి సైతం శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ICMR సహకారం తీసుకోనుంది ఏపీ సర్కార్.
క్షణ క్షణానికీ కౌంట్‌డౌనే. ఔను.. చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. చూస్తుండగానే ప్రాణాలు పోతున్నాయ్.. ఏమైందో తెలుసుకుని CPR చేసేలోపే గుండెలు ఆగిపోతున్నాయ్. మనిషి జీవితానికి గ్యారెంటీ లేదని నిరూపిస్తున్నాయి.. ఈ వీడియోలన్నీ చూస్తుంటే మామూలుగా ఫిట్‌గా ఉన్నాం అనుకునే వాళ్లకు కూడా గుండెలు జారిపోతున్నాయ్..ఆరోగ్యంగా ఉండాలంటే జిమ్ చేయాలంటారు. ఇప్పుడు జిమ్ చేసే గుండెల్లో కూడా దమ్ లేకుండా పోయింది. ఎందుకిలా జరుగుతోంది.. ఆహారపు అలవాట్లు, లైఫ్‌స్టైల్‌లో తేడా వట్లే గుండెలు ఆగిపోతున్నాయా..లేదంటే కరోనా తర్వాత వస్తున్న ఆరోగ్య సమస్యలా.. అసలు కారణమేంటి.. డాక్టర్లకే అందని బ్రహ్మపదార్థమా ఈ గుండెపోటు..మనిషి శరీరంలో..పిడికిలెంత గుండెలో జరుగుతున్న కల్లోలాన్ని గుర్తించలేరా..ఆ కల్లోలానికి కారణమేంటో కనుక్కోలేరా..యువ గుండెల్లో సునామీని సునాయాసంగా దాటించలేరా. అలాంటప్పుడు ఇంత టెక్నాలజీ ఎందుకు.. ఇంత పెద్ద పెద్ద డాక్టర్లు ఏం చేస్తున్నారు. అణువణువు శోధించే వాళ్లు..గుండె లయను మదించలేరా..మర్మం కనిపెట్టలేరా..మందు తయారు చేయలేరా.. అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కరోనా.. దాని కోసం తీసుకున్న మందులు కూడా.. గుండెపై ప్రభావాన్ని చూపిస్తున్నాయంటూ తెగ ప్రచారం జరుగుతోంది. ఏమైనా.. గుండె బలహీనపడింది. యువకుల్లో సైతం పనిచేయక ఆగిపోయేంత ఒత్తిడికి గురౌవుతోంది. ఇప్పటికైనా గుండెను పదిలం చేయడానికి చాలా మార్పులు రావాలి. లేకపోతే.. గుప్పెడంత గుండె.. ఎప్పుడు ఆగిపోతుందో ఎవ్వరూ పసిగట్టలేరు. అందుకే.. శారీరక వ్యాయామంతో పాటు మెంటల్ పీస్ కూడా ఎంతో ముఖ్యమని సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..