AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: నిజంగా నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది బ్రదర్.. చేతులారా కళ్లు పాడు చేసుకున్నాడు..

పిచ్చి పరాకాష్టకు చేరింది. కళ్లు దానం చేసి నలుగురుకు ఆదర్శంగా నిలవాల్సిన యువత.. ఫ్యాషన్ పేరుతో పక్కదారి పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో తొలి ఐబాల్ టాటూ వేయించుకున్నానంటూ.. జగదీష్ అనే యువకుడు తెగ మురిసిపోతున్నాడు. అదేదో నోబెల్ అవార్డు వచ్చినట్లు ఫీలవుతున్నాడు.

Andhra: నిజంగా నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది బ్రదర్.. చేతులారా కళ్లు పాడు చేసుకున్నాడు..
Jagadish With Eyeball Tattoo
Ram Naramaneni
|

Updated on: Feb 03, 2026 | 4:10 PM

Share

ప్రస్తుత సమాజంలో ట్రెండ్ మారుతోంది. తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకోవాలని యువత విభిన్న మార్గాలను అన్వేషిస్తోంది. ఈ ట్రెండ్‌లో భాగంగా కొందరు మీతిమిరి ప్రవర్తిస్తున్నారు. తాజాగా విశాఖకు చెందిన జగదీష్ అనే యువకుడు కనుగుడ్లపై టాటూ వేయించుకుని.. ఏదో గొప్ప పని చేసినట్లు ఫీల్ అవుతున్నాడు. తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా కనుగుడ్లపై టాటూ వేయించుకున్న మొదటి వ్యక్తిని తానే అంటూ తెగ మురిసిపోతున్నాడు. కనుగుడ్డు టాటూ అనేది అత్యంత రిస్క్‌తో కూడిన ప్రక్రియ. చిన్నప్పటి నుంచి డిఫరెంట్‌గా కనపడాలనే తాపత్రయం ఉండేదట ఈయనకు. అందుకే ఈ దారిని ఎంచుకున్నాడు.

ఐటీఐ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన జగదీష్, ప్రస్తుతం టాటూ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నారు. టాటూలు, పియర్సింగ్, టాటూ రిమూవల్ వంటి అన్ని విభాగాల్లో నేపాల్‌లో శిక్షణ పొందాడు.  కంటిలో చిన్న నలుసు పడితేనే విలవిలలాడిపోతాం, అలాంటిది సూదులతో కంటిలోకి ఇంక్ చొప్పించి టాటూ వేయించుకోవడం వినడానికే భయంకరంగా అనిపిస్తుంది. ఈ ప్రక్రియ 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. టాటూ వేసేటప్పుడు ఇంజెక్షన్లతో ఒక లేయర్ లోపల ఇంక్‌ను చొప్పిస్తాయి, అది కనుగుడ్డుపై మొత్తం వ్యాపిస్తుంది. ఈ ప్రక్రియలో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఐబాల్ టాటూకు సాధారణంగా రూ. 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఖర్చవుతుంది. జగదీష్‌కి రూ. 2 లక్షలు ఖర్చయ్యిందట. టాటూ వేయించుకున్న తర్వాత మూడు నెలల పాటు కంటికి ప్రత్యేక సంరక్షణ అవసరం. ఆ తర్వాత కూడా ఏదైనా సమస్య రాదని చెప్పలేం.

వైద్యులు వద్దని చెప్పినా వినకుండా జగదీష్ ఈ టాటూ వేయించుకున్నాడు. అయితే, ఈ ప్రక్రియలో 50-50 శాతం ప్రమాదాలు ఉంటాయని నిపుణులు హెచ్చరించినా, తన కల నెరవేర్చుకోవాలి అంటూ అతను ఈ పైత్యపు పనికి పూనుకున్నాడు. తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్లి.. ఈ పిచ్చి పని చేశాడు. ఇలా రూపు మారిపోయి తమ ఇంటికి వచ్చిన కొడుకును చూసి షాక్‌కు గురయ్యారు.. ఐ బాల్ టాటూ వేసుకున్న అతన్ని చూడాలంటే.. చాలా వికృతంగా, భయానకంగా ఉంది. నిజంగా తన రూపాన్ని తానే స్వయంగా ఇంత వికృతంగా మార్చుకున్న ఆకుర్రాడ్ని చూస్తే జాలి వేస్తుంది. డియర్ యువత.. ప్రత్యేకత పేరుతో ఇలాంటి పనులు మీరు చేయకండి.. మీ జీవితాలను నాశనం చేసుకోకండి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మెల్లకన్ను ఉన్నవారు ఈ పల్లెటూరి ఆకుల సూప్ తాగితే.. చూపు మరింత
మెల్లకన్ను ఉన్నవారు ఈ పల్లెటూరి ఆకుల సూప్ తాగితే.. చూపు మరింత
‘వర్క్ ఫ్రమ్ బైక్’ యువకుడికి సీపీ స్ట్రాంగ్ వార్నింగ్
‘వర్క్ ఫ్రమ్ బైక్’ యువకుడికి సీపీ స్ట్రాంగ్ వార్నింగ్
ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం..
ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం..
అప్పుడు తోపు నటుడు.. ఇప్పుడు వాచ్‌మెన్‌గా..
అప్పుడు తోపు నటుడు.. ఇప్పుడు వాచ్‌మెన్‌గా..
పచ్చి కూరగాయల రోటి పచ్చడి.. పండుగల సమయంలో రైతులకు ఇదే పరమాన్నం
పచ్చి కూరగాయల రోటి పచ్చడి.. పండుగల సమయంలో రైతులకు ఇదే పరమాన్నం
వారెవ్వా.. బిల్డింగ్ పైనుంచి పడిపోతున్న చిన్నారిని గాల్లోనే..
వారెవ్వా.. బిల్డింగ్ పైనుంచి పడిపోతున్న చిన్నారిని గాల్లోనే..
మీరేం మనుషులురా..? అప్పు ఇవ్వలేదని ఫ్రెండ్‌నే చంపేశారు..
మీరేం మనుషులురా..? అప్పు ఇవ్వలేదని ఫ్రెండ్‌నే చంపేశారు..
భారతదేశంపై ‘ఎల్ నినో’ పంజా.. ఈ ఏడాది వానలు తగ్గుతాయా? కీలక ప్రకటన
భారతదేశంపై ‘ఎల్ నినో’ పంజా.. ఈ ఏడాది వానలు తగ్గుతాయా? కీలక ప్రకటన
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే..
ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..  
ఆ ప్రేమకు ప్రేక్షకులు కనెక్ట్ కాలేదేమో..