AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా.? వైసీపీ అధిష్టానం మనసులో మాట ఇదే..

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం ఒక్కసారిగా మారింది. మహానాడు సాక్షిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మినీ మేనిఫెస్టో విడుదల చేయడంతో రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల సందడి మొదలైనట్లైంది. ఇక వైసీపీ కూడా నాలుగేళ్ల పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచారం మొదలు పెట్టింది. తమ పార్టీ నాలుగేళ్లలో ప్రజలకు..

Andhra Pradesh: ఏపీలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా.? వైసీపీ అధిష్టానం మనసులో మాట ఇదే..
AP Politics
Narender Vaitla
|

Updated on: May 30, 2023 | 9:21 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం ఒక్కసారిగా మారింది. మహానాడు సాక్షిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మినీ మేనిఫెస్టో విడుదల చేయడంతో రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల సందడి మొదలైనట్లైంది. ఇక వైసీపీ కూడా నాలుగేళ్ల పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచారం మొదలు పెట్టింది. తమ పార్టీ నాలుగేళ్లలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఇదిలా ఉంటే ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ముందుస్తున్న ఎన్నికలు రానున్నాయా.? అన్న వార్త అందరిలో ఆసక్తిని పెంచేస్తోంది. షెడ్యూల్ ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సుమారు ఏడాది సమయం ఉంది. అయితే ఆరు నెలలు ముందుగానే వైసీపీ ఎన్నికల బరిలోకి దిగనుందా.? అన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఏపీలోనూ ఎన్నికలు జరగుతాయనే చర్చ మొదలైంది.

జూన్‌ 7వ తేదీన సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలంలో కేటినేట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ముందస్తు ఎన్నికల ప్రచారానికి బలాన్ని చేకూర్చినట్లైంది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్‌ అమిత్‌ షాతో పాటు కొందరు బీజేపీ పెద్దలను కలవడం, ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కేబినేట్‌ మీటింగ్‌కు సన్నాహాలు చేయడం ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. అంతేకాకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం రెవన్యూ లోటులో భాగంగా రాష్ట్రానికి రూ. 10 వేల కోట్లు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నిధులతో రానున్న 6 నెలలు పాలన సాఫీగా సాగే అవకాశం ఉండడంతో ఆ తర్వాత ఎన్నికలకు వెళితే వైసీపీ ప్లస్‌ అవుతుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

అయితే ఇదే విషయమై వైసీపీ పార్టీకి చెందిన ఓ కీలక నాయకుడి దగ్గర టీవీ9 ప్రతినిధి ప్రస్తావించగా.. తమకు ముందుస్తు ఎన్నికల యోచన లేదని సదరు నాయకుడు స్పష్టం చేశారు. తాము ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని, ప్రజలు తమకు ఇచ్చిన 5 ఏళ్లు పూర్తయ్యేక ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. వైసీపీ పార్టీపై, ప్రజల్లో సీఎం జగన్‌పై ఉన్న అభిమానమే తమ పార్టీని విజయ తీరాలకు చేరుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. దీంతో ఏపీలో ముందస్తు ఎన్నికలు రానున్నాయన్న వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. మరి జూన్‌ 7న సీఎం అధ్యక్షతన నిర్వహించినున్న కేబినేట్‌ భేటీ తర్వాత ఎన్నికలపై క్లారిటీ వస్తుందేమో చూడాలి