
నారా చంద్రబాబు నాయుడు… టీడీపీ అధినేత… ఏపీ రాజకీయాల్లోనే కాదు.. దేశ రాజకీయాల్లో కూడా సుదీర్ఘ అనుభవం ఉన్న నేత. తన రాజకీయ చాణక్యంతో ఎన్నో సంక్షోభాల నుంచి పార్టీని కాపాడుకుంటూ వచ్చిన ఆయన… ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, అలాగే విభజన తర్వాత కూడా తనదైన శైలిలో పాలించిన నేత. అయితే ఇన్నాళ్లు ఆయన ఎదుర్కొన్న పరీక్షలు వేరు.. మరి కొద్ది రోజుల్లో ఆయన ఎదుర్కోబోతున్న పరీక్ష వేరు. నిజానికి మే 13న జరగబోయే ఎన్నికలు ఆయన పార్టీ భవిష్యత్తునే కాదు, ఆయన రాజకీయ భవిష్యత్తును కూడా నిర్ణయించబోతున్నాయి. మరి ఈ విషయం ఆయనకు కూడా తెలుసా…? అందుకేనా అంతగా కష్టబడుతున్నారు..? ఒక వేళ ఆయన అనుకున్న ఫలితం రాకపోతే… వాట్ నెక్ట్స్…? దేశ రాజకీయాల్లో కీలక పాత్ర… నారా చంద్రబాబు నాయుడు… టీడీపీ అధినేతగా దేశం మొత్తం తెలిసిన పేరు. పేరుకు ప్రాంతీయ పార్టీ అయినా.. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తి. ఎన్డీఏ కన్వీనర్‌గా… దేశానికి రాష్ట్రపతిగా ఎవరుండాలి ? ఎవరు లోక్ సభకు స్పీకర్‌గా ఉండాలి… ఏ పార్టీని అప్పటి ఎన్డీఏలోకి ఎలా తీసుకురావాలి…? ఇలా కేవలం రాజకీయాలు మాత్రమే కాదు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సందర్భంలో హైటెక్ సిటీ నిర్మాణంతో, బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి మహా మహుల్ని హైదరాబాద్ రప్పించిన ముఖ్యమంత్రిగా… విజన్ 2020, జన్మభూమి, ఆర్థిక సంస్కరణలు ఒక్కటి కాదు రెండు...