CM Jagan: “అర్జునుడిపై ఒక బాణం వేస్తే.. కురుక్షేత్రంలో కౌరవులు నెగ్గినట్లు కాదు”
ఒక బాణం వేసినంత మాత్రాన.. కురుక్షేత్రంలో కౌరవులు నెగ్గినట్లు కాదని గుడివాడ సమీపంలో నాగవరప్పాడు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పేర్కొన్నారు. వీళ్ల కుట్రలకు మీ బిడ్డ అదరడు, బెదరడని..ఇలాంటి దాడులతో తన సంకల్పం చెదరదని చెప్పారు.
తనపై జరిగిన దాడి ఘటనపై తొలిసారి స్పందించారు..సీఎం వైఎస్ జగన్. అర్జునుడిపై ఒక బాణం వేసినంత మాత్రాన.. కురుక్షేత్రంలో కౌరవులు నెగ్గినట్లు కాదని స్పష్టం చేశారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో నాగవరప్పాడు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు జగన్. వైఎస్ జగన్‌పై ఒకరాయి వేసినంత మాత్రాన..పేదల ప్రభుత్వం గెలుపును ఎవరూ ఆపలేరన్నారు సీఎం జగన్. వారు ఈ స్థాయికి దిగజారారు అంటే.. వైసీపీవిజయానికి అంత చేరువగా ఉన్నామని అర్థమని చెప్పారు. ఇలాంటి తాటాకుచప్పుళ్లకు తాను భయపడేది లేదని స్పష్టం చేసారు.
దేవుడు తన విషయంలో పెద్ద స్కిప్ట్ రాశాడన్నారు..వైఎస్ జగన్. అందుకే దుండగులు విసిరిన రాయి కంటికి కాకుండా..నుదుటికి తగిలిందన్నారు. ఒక రాయి వేసినంత మాత్రాన దుష్టచతుష్టయం గెలిచినట్లు కాదన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
Published on: Apr 15, 2024 07:41 PM
వైరల్ వీడియోలు
Latest Videos