Crime: వందల్లో చోరీలు.. కొట్టేసిన డబ్బు, నగలు దాచేది వల్లకాటిలో.. ఎలాగో తెలిస్తే షాక్..

| Edited By: Ravi Kiran

Sep 15, 2022 | 2:25 PM

చోరీలు చేయడం దొరికినకాడికి దోచుకోవడం ఇది చోరుల లక్షణం.దోచుకున్న డబ్బును విలాసాల కోసం ఖర్చుచేయడం లేదా భవిష్యత్తు అవసరాల కోసం దాచుకుంటూ ఉంటారు కొందరు. అదే పోలీసులకు దొరికితే దోచుకున్నదంతా..

Crime: వందల్లో చోరీలు.. కొట్టేసిన డబ్బు, నగలు దాచేది వల్లకాటిలో.. ఎలాగో తెలిస్తే షాక్..
SI Arrested
Follow us on

Crime News: చోరీలు చేయడం దొరికినకాడికి దోచుకోవడం ఇది చోరుల లక్షణం.దోచుకున్న డబ్బును విలాసాల కోసం ఖర్చుచేయడం లేదా భవిష్యత్తు అవసరాల కోసం దాచుకుంటూ ఉంటారు కొందరు. అదే పోలీసులకు దొరికితే దోచుకున్నదంతా రికవరీ చేస్తారు. అయితే దొంగలు దోచుకున్నది ఇంట్లోనో లేదా ఇంకా ఏదైనా రహస్య ప్రదేశాల్లో దాచుకోవడం సహజం. కాని ఓ దొంగ మాత్రం శ్మశానాన్ని తన కేరాఫ్ అడ్రస్ గా చేసుకుని చోరీలకు పాల్పడుతూ.. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. అయితే ఇతగాడికి జైలుకెళ్లడం కొత్తేమీ కాదు. గతంలోనూ అనేక కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చినా.. దొంగతనాలను మాత్రం మానలేదు. దీంతో తినడం, తాగడం, పడుకోవడం శ్మశానంలోనే.. తాళాలు వేసి ఉన్న ఇళ్లల్లో దొంగతనాలు చేసి.. దోచుకున్నదంతా దాచుకునేది శ్మశానంలోనే. ఇలా శ్మశానాల్లో ఉంటూ చోరీలకు పాల్పడతున్న ఘరానా దొంగను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెక్కీ నిర్వహించి టార్గెట్‌ చేసిన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతూ.. కొట్టేసిన సొత్తు శ్మశానాల్లో దాచిపెడతాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 121 చోరీలకు పాల్పడిన అంతర్‌రాష్ట్ర దొంగను చల్లపల్లి, సీసీఎస్‌ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు.

చాట్రాయి మండలం చిత్తపూర్‌ గ్రామానికి చెందిన సురేంద్ర అలియాస్‌ సూర్య చోరీలను వృత్తిగా చేసుకున్నాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలు చేస్తాడు. ఇతనిపై ఏలూరు జిల్లా చాట్రాయి పోలీసుస్టేషన్‌లో డీసీ షీట్‌ ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా చోట్ల చేతివాటం ప్రదర్శించాడు. గత నెల 28న చల్లపల్లి ఇస్లాంనగర్‌లో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సూర్యను అదుపులోకి తీసుకుని విచారించడంతో మరికొన్ని నేరాలు వెలుగుచూశాయి. ఓ కేసులో సూర్యను పీడీ యాక్ట్‌పై ఖమ్మం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకోగా వరంగల్‌ జైలులో శిక్ష అనుభవించాడు. గతనెల 17న విడుదలైన తర్వాత 20 రోజుల వ్యవధిలో చల్లపల్లితో పాటు గుడివాడ, జంగారెడ్డిగూడెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, రాజానగరం, ఖమ్మంలో దొంగతనాలకు పాల్పడ్డాడు.

శ్మశానవాటికల్లో ఉండంటం..మద్యం తాగి నిద్ర పోవడం..అన్నీ సమాధులపైనే చేస్తాడు. సెల్‌ఫోన్‌, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఉపయోగించడు. చేతికి గ్లౌజ్‌ ధరించి సీసీ కెమెరాల కనెక్షన్‌లను కట్‌ చేస్తాడు. చోరీ తర్వాత సొత్తును శ్మశానాల్లో పాతిపెట్టి అవసరం వచ్చే వరకూ దాస్తాడు. ఖమ్మం జైలు నుంచి విడుదలయ్యాక ఏడు చోరీల్లో దొంగిలించిన రూ.20 లక్షలు విలువ చేసే బంగారు నగలు, వెండి ఆభరణాలు, బైక్‌, నగదును ప్రత్యేక బృందాలు శ్మశానం నుంచే రికవరీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..