Jaahnavi Kandula: అమెరికాలో ఏపీ స్టూడెంట్ మృతిపై స్పందించిన భారత్.. వెంటనే సమగ్ర దర్యాప్తు జరపాలంటూ..

|

Sep 14, 2023 | 11:05 AM

Jaahnavi Kandula: జాహ్నవి మృతిపై తాజాగా భారత్ స్పందించింది. అధికారి బాడీక్యామ్ ఫుటేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలని అమెరికాను కోరింది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన  కందుల జాహ్నవి (23) సౌత్ లేక్‌లోని నార్త్‌ ఈస్టర్న్ యూనివర్సిటీలో చదువుకుంటోంది.  ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి 23న థామస్ స్ట్రీస్‌లోని డెక్స్‌టర్ అవెన్యూ నార్త్ సమీపంలో.. జాహ్నవి రోడ్డుపై నడుస్తుండగా కెవిన్ డేవ్..

Jaahnavi Kandula: అమెరికాలో ఏపీ స్టూడెంట్ మృతిపై స్పందించిన భారత్.. వెంటనే సమగ్ర దర్యాప్తు జరపాలంటూ..
Jaahnavi Kandula
Follow us on

Jaahnavi Kandula: అమెరికాలో భారతీయ విద్యార్థిని కందుల జాహ్నవి కారు ఢీకొనడంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీటెల్‌ పోలీసు అధికారి సరదాగా జోకులు వేస్తూ భారతీయ విద్యార్థుల ప్రాణాలకు విలువ లేదంటూ మాట్లాడిన బాడీక్యామ్ ఫుటేజీ నెట్టింట వైరల్‌గా మారింది. సదరు అధికారి వ్యాఖ్యలపై ఇప్పటికే నిరసన వ్యక్తమవుతుండగా.. జాహ్నవి మృతిపై తాజాగా భారత్ స్పందించింది. అధికారి బాడీక్యామ్ ఫుటేజీపై సమగ్ర దర్యాప్తు జరపాలని అమెరికాను కోరింది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన  కందుల జాహ్నవి (23) సౌత్ లేక్‌లోని నార్త్‌ ఈస్టర్న్ యూనివర్సిటీలో చదువుకుంటోంది.  ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి 23న థామస్ స్ట్రీస్‌లోని డెక్స్‌టర్ అవెన్యూ నార్త్ సమీపంలో.. జాహ్నవి రోడ్డుపై నడుస్తుండగా కెవిన్ డేవ్ అనే సీటెల్‌కు చెందిన పోలీసు అధికారుల గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్‌ ఆడెరెర్ నడుపుతున్న కారు వేగంగా వచ్చి ఆమెను ఢీకొంది. ఈ ప్రమాదంలో జాహ్నవి తీవ్రగాయాలతో అక్కడికక్కడే మరణించింది.

అయితే డేనియల్‌ ఆడెరెర్ గిల్డ్ అధ్యక్షుడు మైక్ సోలన్‌తో ఫోన్‌ మాట్లాడుతూ ‘11,000 డాలర్లకు చెక్ రాస్తే చాలు.. ఆమెకు 26 ఏళ్లు. ఆమెకు విలువ చాలా తక్కువ’ అంటూ గట్టిగా నవ్వడమే గాక.. ఇదంతా మామూలే అంటూ భారతీయ విద్యార్థిని మరణాన్ని చాలా తేలికగా కొట్టిపారేశాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ కావడం, ప్రమాద సమయంలో అతని వేగంపై తప్పుడు లెక్కలతో అమెరికాలో భారత విద్యార్థులు ఎదుర్కొంటున్న రేసిజం మరో సారి బయటపడింది.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతోన్న వీడియో..


దీంతో రంగంలోకి దిగిన ఇండియన్ ఎంబసీ ‘ఈ విషాద కేసులో ప్రమేయం ఉన్న వారిపై సమగ్ర విచారణ, చర్యలు తీసుకోవాలని సీటెల్, వాషింగ్టన్ స్థానిక అధికారులతో పాటు వాషింగ్టన్‌లోని సీనియర్ అధికారుల ముందుకు ఈ విషయాన్ని తీసుకెళ్లాము’ అని పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..