Cockfight: కోనసీమలో పందెం కోళ్లతో బెట్టింగ్ రాయుళ్లు రెడీ.. పోలీసుల వార్నింగ్స్ బేఖాతరు..

Cockfight: తెలుగు వారి లోగిళ్ళలో పెద్ద పండగ సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. మూడు రోజులు ఘనంగా జరుపుకునే ఈ పండగ సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు. సంక్రాంతి రోజుల్లో..

Cockfight: కోనసీమలో పందెం కోళ్లతో బెట్టింగ్ రాయుళ్లు రెడీ.. పోలీసుల వార్నింగ్స్ బేఖాతరు..
Cock Fighting In Konaseema
Follow us
Surya Kala

|

Updated on: Jan 03, 2022 | 4:21 PM

Cockfight: తెలుగు వారి లోగిళ్ళలో పెద్ద పండగ సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. మూడు రోజులు ఘనంగా జరుపుకునే ఈ పండగ సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు. సంక్రాంతి రోజుల్లో గోదావరి జిల్లాల్లో కనిపించేది కోడి పందాలు. నెల రోజుల ముందునుంచే పందెంరాయుళ్లు తమ కోళ్లకు కత్తులు కట్టి బరిలో దింపడానికి రెడీ అయిపోతుంటారు. తూర్పుగోదావరి జిల్లాలోని పలు చోట్ల కోడి పందాల బరులను నిర్వాహకులు రెడీ చేశారు. వివరాల్లోకి వెళ్తే..

కోనసీమలోని ఐ.పోలవరం, ముమ్మిడివరం, కాట్రేనికొన, పల్లంకుర్రు మండలాల్లో సంప్రదాయం ముసుగులోనిర్వాహకులు కోడి పందాలకు బరులు రెడీ చేస్తున్నారు. గత నాలుగేళ్ళుగా ఐ.పోలవరం మండలంలో ఫ్లడ్ లైట్లు, డ్రోన్ కెమెరా చిత్రీ కరణ నడుమ కోడి పందాలను హైటెక్ పద్దతిలో నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఏడాది కాట్రేనికోన మండలం పల్లంకుర్రులో కోడి పందాలు నిర్వహించడానికి భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. పల్లంకుర్రులో పందెంరాయుళ్లు పది ఎకరాల్లో పందాలు నిర్వహించడానికి బరులు రెడీ చేస్తున్నారు. అయితే ఈ కోడి పందాలకు అనుమతులు ఇవ్వాలని రాజకీయనాయకులపై స్థానిక నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

ఓ వైపు జిలాల్లో సంక్రాంతి కి జోరుగా బెట్టింగ్ బంగార్రాజులు కోళ్లతో రెడీ అయిపోతుంటే.. మరో వైపు జిల్లా పోలీసులు పందెంరాయుళ్లపై కన్నెర్రజేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లాలో కోడి పందాలను జరగనివ్వమని పోలీసులు చెబుతున్నారు.

అయితే మరో వైపు గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జరిగే కోళ్ల పందాలను చూడడానికి ఆంద్రప్రదేశ్, తెలంగాణతో పాటు బెంగళూరు తదితర ప్రాంతల నుంచి వచ్చే వారి కోసం పందెంరాయుళ్లు ఇప్పటికే యానాం, అమలాపురం ప్రాంతాల్లో ఇప్పటికే వసతి గదులు బుకింగ్ చేశారు.

Also Read:  రామ జన్మభూమి రూపురేఖలు మార్చనున్న కేంద్రం.. సాంస్కృతిక రాజధానిగా అయోధ్య