Weather Report: అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో మరో 2 రోజులు దంచికొట్టుడే! పిడుగులు పడే ఛాన్స్‌

దిత్వా తుపాను బలహీనపడి రెండు రోజుల క్రితం వాయుగుండంగా మారిన సంగతి తెలిసిందే. అది బుధవారం అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో మరో రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గురువారం వాతావరణం ఎలా ఉంటుందంటే..

Weather Report: అల్పపీడనం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో మరో 2 రోజులు దంచికొట్టుడే! పిడుగులు పడే ఛాన్స్‌
Andhra Pradesh Rains

Updated on: Dec 04, 2025 | 6:58 AM

అమరావతి, డిసెంబర్ 4: దిత్వా తుపాను బలహీనపడి రెండు రోజుల క్రితం వాయుగుండంగా మారిన సంగతి తెలిసిందే. అది బుధవారం అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో మరో రెండు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. గురువారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దిత్వా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి.

తిరుపతి జిల్లా చిట్టమూరులో మంగళవారం ఉదయం నుంచి బుధవారం వరకు 27.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో 27.2, ఇదగలిలో 24, తిరుపతి జిల్లా అల్లంపాడులో 23.8, విద్యానగర్‌లో 19.6, నెల్లూరు జిల్లా మనుబోలులో 17.9, మల్లంలో 17.6, అక్కంపేటలో 16.7, నెల్లూరులో 14 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు గూడూరులోనూ భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో గూడూరు పట్టణం లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చిల్లకూరు జాతీయ రహదారిపై వరగలి క్రాస్ వద్ద వరద నీరు భారీగా నలిచిపోవడంతో వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. గూడూరు – పారిచర్ల వారి పాలెం, గూడూరు – విందూరు.. రాకపోకలు నిలిపివేశారు. ఇక చిట్టమూరు నాయుడుపేట రహదారిపై కూడా భారీగా వర్షం నీరు నిలవడంతో రాకపోకలు నిలిపివేశారు.

పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా కు అంతరాయం కలిగింది. గూడూరులోని చవటపాలెం, జనార్దన్ రెడ్డి కాలనీ, పూల తోట, మధు రెడ్డి కాలనీలోకి వరద పొంగిపొర్లుతుంది. పంబలేరు వాగు ,ఉప్పుటేరు వాగు, వాకాడు బ్యారేజ్ లో 8 గేట్లు ఎత్తి నీటి విడుదల చేశారు. నెల్లూరు రూరల్, సైదాపురం, నాయుడుపేట, అల్లూరు, మనుబోలు, ముత్తుకూరు, ఇందుకూరుపేట, తిరుపతి జిల్లా గూడూరు, చింతవరం, సూళ్లూరుపేట, తొట్టంబేడు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి.
ఉన్నట్లు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

తెలంగాణలో స్వల్పంగా తగ్గిన చలి..

బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతలు ఇవే..

  • ఆదిలాబాద్.. 10.7
  • మెదక్.. 14.1
  • హనుమకొండ.. 15
  • నిజామాబాద్..15.3
  • పటాన్ చెరువు.. 15.4
  • రాజేంద్ర నగర్.. 16
  • రామగుండం.. 16.4
  • దుండిగల్.. 17
  • నల్లగొండ.. 17.2
  • హైదరాబాద్.. 17.8
  • హకింపేట్.. 18
  • హయత్ నగర్.. 18.6
  • ఖమ్మం.. 20
  • మహబూబ్ నగర్.. 20.1
  • భద్రాచలం.. 21.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.