AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్.. మూడ్రోజుల పాటు రెయిన్స్.. వాతావరణశాఖ బిగ్ అలర్ట్..

ఏపీ, తెలంగాణకు వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. రాబోయే మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఉపరితల ద్రోణి ప్రభాంతో వానలు పడతనున్నాయి. అటు గరిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పు లేదని వాతావరణశాఖ స్పష్టం చేసింది.

Weather Report: తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్.. మూడ్రోజుల పాటు రెయిన్స్.. వాతావరణశాఖ బిగ్ అలర్ట్..
Rains
Venkatrao Lella
|

Updated on: Apr 20, 2026 | 4:10 PM

Share

తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, వాతావరణ హెచ్చరికలను హైదరాబాద్ వాతావరణశాఖ జారీ చేసింది. ద్రోణి / గాలి విచ్చితి ఒకటి ఈరోజు తెలంగాణ ప్రాంతం నుండి రాయలసీమ అంతర్గత తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు సముద్రమట్టం నుండి 1.5 కి మీ ఎత్తులో ఏర్పడింది. నిన్న తూర్పు ఉత్తర ప్రదేశ్ నుండి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి ఈరోజు తూర్పు బీహార్ నుండి జార్ఖండ్, ఉత్తర చత్తీస్‌గఢ్ మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ ప్రాంతం వరకు సగటు సముద్రం నుండి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతోంది.నిన్న ఉత్తర అంతర్గత కర్నాటక నుండి మన్నార్ వరకు కొనసాగిన ఉత్తర దక్షిణ ద్రోని ఈరోజు బలహీనపడినట్లు హైదరాబాద్ వాతావరణశాఖ స్పష్టం చేసింది.

మూడ్రోజుల పాటు రెయిన్ అలర్ట్

ఈ క్రమంలో ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ స్పష్టం చేసింది.రానున్న రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్ద మార్పు ఏమి లేదని తెలిపింది.ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30- 40 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈరోజు రాష్ట్రంలోని ఒకటి రెండు పశ్చిమ, తూర్పు జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు, వడగళ్ళతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

తెలంగాణకు వర్షసూచన

అటు ఏపీలో కూడా రాబోయే మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణశాఖ తెలిపింది. తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని అంచనా వేసింది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముందని స్పష్టం చేసింది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

Follow Us
'ఇంట్రెస్టింగ్ మిస్టికల్ థ్రిల్లర్..' ఆహాలో మంచి సిరీస్
'ఇంట్రెస్టింగ్ మిస్టికల్ థ్రిల్లర్..' ఆహాలో మంచి సిరీస్
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. మూడ్రోజుల పాటు వర్షాలే..
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. మూడ్రోజుల పాటు వర్షాలే..
ఆ లేడీ యాంకర్ నాపై చేతబడి చేయించింది.. యాంకర్ రవి సంచలన కామెంట్స్
ఆ లేడీ యాంకర్ నాపై చేతబడి చేయించింది.. యాంకర్ రవి సంచలన కామెంట్స్
ఇదో స్వచ్ఛమైన పల్లెటూరి కథ..! 90ల్లోకి అలా వెళ్లి వచ్చేయచ్చు
ఇదో స్వచ్ఛమైన పల్లెటూరి కథ..! 90ల్లోకి అలా వెళ్లి వచ్చేయచ్చు
మీరు ఇచ్చిన అప్పు సేఫ్‌గా తిరిగి రావాలంటే..ఈ 5 తప్పులు చేయకండి!
మీరు ఇచ్చిన అప్పు సేఫ్‌గా తిరిగి రావాలంటే..ఈ 5 తప్పులు చేయకండి!
మిక్సీ, రోలు లేకుండా చేతితో చేసే ఈజీ పచ్చడి.. ఎండల్లో ఇదే తోపు
మిక్సీ, రోలు లేకుండా చేతితో చేసే ఈజీ పచ్చడి.. ఎండల్లో ఇదే తోపు
వావ్.. జస్ట్ ఐదే 5 నిమిషాల్లో పవర్‌ఫుల్ ఫుడ్.. ఇలా చేశారంటే అమృతం
వావ్.. జస్ట్ ఐదే 5 నిమిషాల్లో పవర్‌ఫుల్ ఫుడ్.. ఇలా చేశారంటే అమృతం
విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. భార్య సంగీత ఎంత భరణం అడిగిందో..
విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. భార్య సంగీత ఎంత భరణం అడిగిందో..
వృషభ రాశిలోకి శుక్రుడు.. ఆరు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం!
వృషభ రాశిలోకి శుక్రుడు.. ఆరు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం!
మారేడు చెట్టు కింద ఈ ఒక్క పని చేస్తే చాలు.. మహా ఐశ్వర్యం! చాగంటి
మారేడు చెట్టు కింద ఈ ఒక్క పని చేస్తే చాలు.. మహా ఐశ్వర్యం! చాగంటి