పైన చూస్తే తెల్లటి రాతి బండ.. చెరిపి చూస్తే బయటపడ్డ వెయ్యేళ్ల నాటి శాసనం.. ఎక్కడంటే?
విజయనగరం జిల్లాలో పదవ శతాబ్దం నాటి పురాతన రాతి శాసనాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు వెయ్యి సంవత్సరాల నాటి ఆ శాసనాల ఆధారంగా నాడు ఆ ప్రాంతాన్ని ఎవరు పాలించారు? ఆ శాసనాల్లో ఏమి పొందుపరచబడి ఉంది? అనే అనేక అంశాల పై ఇప్పుడు జిల్లాలో తీవ్ర చర్చ సాగుతుంది.
విజయనగరం జిల్లాలో పదవ శతాబ్దం నాటి పురాతన రాతి శాసనాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు వెయ్యి సంవత్సరాల నాటి ఆ శాసనాల ఆధారంగా నాడు ఆ ప్రాంతాన్ని ఎవరు పాలించారు? ఆ శాసనాల్లో ఏమి పొందుపరచబడి ఉంది? అనే అనేక అంశాల పై ఇప్పుడు జిల్లాలో తీవ్ర చర్చ సాగుతుంది. విషయం తెలుసుకున్న ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ శాసనాలను సేకరించి వాటిపై లోతైన అధ్యయనం చేస్తున్నారు. బయటపడిన శాసనాల గురించి తెలుసుకున్న స్థానికులు వాటిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
విజయనగరం జిల్లా జామి త్రిపురాంతక స్వామివారి ఆలయంలో తాజాగా పురాతన రాతి శిలాశాసనాలు బయటపడ్డాయి. ఈ ఆలయంలో ఉన్న త్రిపురాంతక స్వామి వారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి సైతం నిత్యం వేలాదిగా తరలివస్తుంటారు. ఈ ఆలయం ద్వాపర యుగంలో పాండవులు పన్నెండు ఏళ్ళ అరణ్యవాసం తర్వాత ఏడాది పాటు అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో ఈ ప్రాంతంలో పర్యటించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో ఉన్న జమ్మిచెట్టు పైనే యుద్ధానికి వాడిన ఆయుధసామగ్రి భద్రపరిచారని, ఇక్కడ ఉన్న జమ్మిచెట్టు వల్ల ఈ ప్రాంతాన్ని జామి అని పిలుస్తారు అని చెప్తారు. పాండవులు పర్యటించిన సమయం నాటికే భూమి లోపల నుండి 174 అడుగుల లోతు మేర స్వయం భూగా వెలిసిన శివలింగం ఉందని, ఆ శివలింగానికి పాండవులు నిత్యం పూజలు చేసేవారని చెప్తారు.
అంతటి స్థల పురాణం ఉన్న ఈ ఆలయంలో ఎప్పటినుండో రాతి శిలాశాసనాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ఆ శాసనాలను అని తెలియని భక్తులు స్వామి వారి మంత్రాలుగా భావించి భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. అయితే ఇటీవల ఇక్కడ శిలాశాసనాలు ఉన్నాయని తెలుసుకున్న ఏపీ గ్రాఫికల్ ఇండియా సొసైటీ కి చెందిన పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ వెంకట రాఘవేంద్ర వర్మ జామిలోనే ఈ ఆలయానికి చేరుకున్నారు. శిలాశాసనాలను పరిశీలించి వాటిని సేకరించారు. తర్వాత మైసూర్ లోనే తమ ఆర్కియాలజీ కార్యాలయానికి వెళ్లి ఆ శాసనాలను తర్జుమా చేశారు. ఆ శాసనల ద్వారా ఈ ఆలయాన్ని తూర్పు గాంగు చక్రవర్తి అయిన అనంత దేవ వర్మ పాలనలో చెక్కించినవిగా నిర్ధారించారు. ఆయన త్రిపురాంతకేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించినట్లు ఆలయ అఖండ దీపానికి కొత్త భూమిని కూడా సమర్పించినట్లు లిఖించబడి ఉందని పేర్కొన్నారు.
తూర్పు గాంగుల చక్రవర్తుల్లో ఒకరైన అనంతదేవ వర్మ 1050 నుండి 1140 మధ్యకాలంలో కళింగ రాజ్యాన్ని పాలిస్తున్న సమయంలో ఈ ఆలయాన్ని సందర్శించినట్లు గుర్తించారు. ఈయన కళింగ ప్రాంతంతో పాటు ఒడిశాలోని కొంత ప్రాంతాన్ని కూడా ఏలినట్లు తెలుస్తుంది. ఇదే విషయం ఇక్కడ ఉన్న రాతి శిలాశాసనాలు లిఖించబడినట్లు తెలుసుకున్నారు. ఈ శాసనాలు వంద ఏళ్ళ నాటి కావడంతో పాటు భక్తులు పూజలు చేయడం వల్ల చాలా వరకు చెరిగిపోయాయని, మరింత లోతైన అధ్యయనం చేస్తున్నామని భవిష్యత్ లో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..