Andhra Pradesh: ఏపీ పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్‌.. ఒక రోజు ముందుగానే పెన్షన్లు

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా పెన్షన్‌ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. ప్రతినెల 1వ తేదీన పెన్షన్‌లను అందించే విధంగా చర్యలు తీసుకుంటోంది. అయితే తాజాగా పెన్షన్‌దారుల కోసం ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ తెలిపింది. ఈనెల ఒక రోజు ముందుగానే..

Andhra Pradesh: ఏపీ పెన్షన్‌దారులకు గుడ్‌న్యూస్‌.. ఒక రోజు ముందుగానే పెన్షన్లు
Ap Pensioners
Follow us
Subhash Goud

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 29, 2024 | 8:38 AM

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల కోసం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా పెన్షన్‌ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. ప్రతినెల 1వ తేదీన పెన్షన్‌లను అందించే విధంగా చర్యలు తీసుకుంటోంది. అయితే తాజాగా పెన్షన్‌దారుల కోసం ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ తెలిపింది.  ఒక రోజు ముందుగానే పెన్షన్‌లను అందించేందుకు నిర్ణయం తీసుకుంది. అంటే 31న పెన్షన్‌లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆగస్టు 28న జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.

ఎందుకంటే సెప్టెంబర్‌ 1న ఆదివారం సెలవు రోజు కావడంతో ఒక రోజు.. ముందుగానే పెన్షన్లను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఏదైనా కారణంగా ఈ నెల 31న పెన్షన్లు అందకపోతే సెప్టెంబర్‌ 2వ తేదీన అందరికి అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాలన పరంగా కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటోంది.

ఏపీలో కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్ పెంచిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం రూ.3,000 పెన్షన్ ఇస్తే దాన్ని రూ.4,000కి పెంచింది. మొత్తం 11 కేటగిరీల్లో పెన్షన్ 3000 నుంచి 4000 వేలకు పెంచారు. వృద్ధాప్య, వితంతువులకు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులకు, మత్స్యకారులు, చెప్పులు కుట్టేవారు, ట్రాన్స్ జెండర్, డప్పు కళాకారులకు,  ఒంటరి మహిళలు, హెచ్ఐవీ (PLHIV)తో జీవిస్తున్న వ్యక్తులలో యాంటీరెట్రో వైరల్ థెరపీ ఉన్నవారికి, కళాకారులకు ఇలాంటి కేటగిరీల్లో పెన్షన్ రూ.3,000 నుంచి 4,000కు పెంచారు. వికలాంగులకు, మల్టీడిఫార్మిటీ లెప్రసీలకు పెన్షన్ రూ.3,000 నుంచి రూ.6,000కు పెన్షన్‌‌ను పెంచింది ఎన్డీఏ ప్రభుత్వం. పూర్తి స్థాయి (వీల్ చైర్, బెడ్‌కే పరిమితం అయిన) పక్షవాతంతో ఉన్నవారికి, తీవ్రమైన మస్కులర్ డిస్ట్రోఫీ కేసులు, ప్రమాద బాధితులు పెన్షన్ రూ.5,000 నుంచి రూ.15,000కు పెంచారు.‌ కిడ్నీ, తలసేమియా మొదలైన దీర్ఘకాలిక వ్యాధుల్లో ఐదు కేటగిరీల్లో రూ.5,000 నుంచి రూ.10,000కి పెంచారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి