AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రివర్స్ టెండరింగ్ సహా 12 అంశాలకు ఆమోదముద్ర..!

క్రమక్రమంగా ఆంధ్రప్రదేశ్ పాలనలో తన మార్క్ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలో కేబినెట్ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రివర్స్‌ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది

AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రివర్స్ టెండరింగ్ సహా 12 అంశాలకు ఆమోదముద్ర..!
Ap Cabinet Meet
Follow us
Eswar Chennupalli

| Edited By: Balaraju Goud

Updated on: Aug 28, 2024 | 9:15 PM

క్రమక్రమంగా ఆంధ్రప్రదేశ్ పాలనలో తన మార్క్ తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలో కేబినెట్ భేటీలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రివర్స్‌ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది మంత్రివర్గం. డిజిటలైజేషన్‌ దిశగా అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ క్రమంలో మొదటి సారి పేపర్‌లెస్‌ ఈ-క్యాబినెట్‌ సమావేశం నిర్వహించింది. అజెండా మొదలు.. నోట్స్‌ వరకు అన్ని ఆన్‌లైన్‌లోనే మంత్రులకు అందజేశారు. కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు మంత్రివర్గ సమావేశ మందిరంలో బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తొలి ఈ-కేబినెట్ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు.

వీడియో చూడండి..

2014-2019 మధ్య కాలంలో నిర్వహించిన కాగిత రహిత (పేపర్‌లెస్) కేబినెట్ తరహా మరొక అధునాతన అప్లికేషన్ వినియోగించి నేడు మొదటి ఈ – కేబినెట్ సమావేశాన్ని నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. ఢిల్లీలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన బహుళ ఫీచర్లతో కూడిన సమగ్ర అప్లికేషన్ ఆధారంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం నేడు ఈ- కేబినెట్ నిర్వహించింది. ఈ-కేబినెట్ విధానంలో మంత్రివర్గ ఎజెండా, కేబినెట్ నోట్స్ ఇలా అన్నీ ఆన్ లైన్ లోనే అందుబాటులో ఉంటాయి. పేపర్‌లెస్ కాన్సెప్ట్‌తో ఈ-కేబినెట్ నిర్వహణ అంటే కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాస్తవికతకు అద్దం పడుతుంది. తద్వారా పర్యవేక్షణ సామర్ధ్యం పెరుగడంతో పాటు పర్యావరణానికి అనుకూలమైన విధానం.

ఈ-కేబినెట్ వల్ల ఉపయోగాలుః

కేబినెట్ నిర్ణయాల అమలు తీరును మంత్రులు సమర్థంగా పర్యవేక్షించే వీలు కలుగుతుంది. ఎక్కడైనా, ఎప్పుడైనా సంబంధిత సమాచారం ఆన్‌లైన్‌లో యాక్సెస్ చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. సమాచారం గోప్యంగా ఉంచేందుకు వీలుంటుంది. కేబినెట్ నిర్ణయాల అమలు స్థితిని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా పర్యవేక్షించడం, అంచనా వేసేందుకు అనుకూలంగా ఉంటుంది. సమగ్ర డేటా విశ్లేషణ, రిపోర్టింగ్ సామర్థ్యం, అనధికార యాక్సెస్ ను నిరోధించి సమాచారాన్ని భద్రపరిచేందుకు అవకాశం ఉంది. అవసరమైతే వర్చువల్ కేబినెట్ సమావేశాన్ని ఈ – ఆఫీస్ తో అనుసంధానం చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించడం వంటి అదనపు లక్షణాలను కలిగి ఉంది.

రాష్ట్రంలో జనావాస ప్రాంతాల్లో 14,000 సీసీ కెమెరాలు ఉన్నాయని, అలాగే ప్రైవేట్ యాజమాన్యంలో, ప్రైవేట్ స్థలాలు మరియ భవనాల దగ్గరున్న సీసీ టీవీలు అనుసంధానం చేయడం ద్వాారా శాంతి భద్రతల పర్యవేక్షణకు ఉపకరిస్తుంది. కనుక దీనిపై ఒక ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టాలని కేబినెట్ కు ముఖ్యమంత్రి సూచించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ కు సాంకేతికతను జోడిస్తూ ఇన్సిడెంట్ మానిటరింగ్ సిస్టమ్, అలర్ట్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ద్వారా రాష్ట్రంలో జరిగే సంఘటనలు ఎప్పటికప్పుడు ప్రత్యక్ష పర్యవేక్షణ చేసి తగు చర్యలు చేపట్టేందుకు వీలుంటుందని అన్నారు. డ్రోన్ల వినియోగం ద్వాారా కూడా రోడ్లపై గుంతలు గుర్తించడం, దోమల నియంత్రణ, అంటువ్యాధులు అరికట్టడం, తక్కువ ఖర్చుతో వ్యవసాయంలో మందుల పిచికారీ చేసేందుకు దోహదపడుతుందన్నారు.

కేబినెట్ అజెండా లోని 12 అంశాలు ఇవేః

1. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్:

07-03-2024న G.O. MS.No.41 ప్రకారం జారీ చేసిన ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని మెరిట్ జాబితాలో మిగిలిపోయిన ఆసక్తి గల, అర్హులైన బికాం. అభ్యర్థులను గ్రేడ్-2 కేటగిరిలో వార్డ్ వెల్ఫేర్ & డెవలప్ మెంట్ సెక్రటరీలుగా నియమించేందుకు 269 సూపర్ న్యూమరీ పోస్టులను మంజూరు చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. స్టేట్‌మెంట్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం జిల్లా వారీగా, రాష్ట్ర ఖజానాపై అదనపు ఆర్థిక భారం పడకుండా ఈ సిబ్బందిని చేర్చుకునే వరకు, కోర్టు ధిక్కార పరిధిలోకి రాకుండా, ఆర్థిక శాఖ అంగీకారం మేరకు సాంఘిక సంక్షేమ శాఖలోని సంక్షేమ, విద్యా సహాయకుల పోస్టులను ఖాళీగా ఉంచాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

2. సాగునీటి రైతు సంఘాల ఎన్నికలకు ఆమోదంః

ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ మేనేజ్ మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్ యాక్ట్ – 2018 సెక్షన్ 4 ప్రకారం సాగునీటి రైతు సంఘాల ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మేజర్ ప్రాజెక్టుల్లో భాగంగా తోట వెంకటాచలం పుష్కర లిప్ట్ ఇరిగేషన్ సిస్టమ్ పరిధిలో సాగయ్యే 89,449 ఎకరాలు, మీడియం ప్రాజెక్టుల క్రింద మడ్డువలసలో సాగు అయ్యే 24,877 ఎకరాలు, సూరంపాలెం మీడియం ప్రాజెక్టు క్రింద 11,931 ఎకరాలు మొత్తంగా 1,26,257 ఎకరాల ఆయకట్టు పరిధిని స్థిరీకరించడం, సంబంధిత ప్రాంత ఓటర్ లిస్ట్ జాబితాను నవీకరించి 90 రోజుల్లోగా సాగునీటి రైతు సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ మేనేజ్ మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ వాటర్ యూజర్స్ అసోసియేషన్ నిబంధనలు – 2003 (జీవో ఎం.ఎస్ నంబర్ 20, I&CAD, తేది: 20.02.2003) లోని రూల్ 12 (5) ను తొలగించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.

3. రివర్స్ టెండర్ విధానం రద్దుః

రివర్స్ టెండర్ విధానం రద్దు చేసిన కేబినెట్. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదించింది. 2019లో లోపభూయిష్టంగా గత ప్రభుత్వం తీసుకువచ్చిన రివర్స్ టెండర్ విధానానికి స్వస్తి పలుకుతూ రద్దు చేయాలన్న ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నూతన టెండరింగ్ విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి కేబినెట్ కు సూచించారు.

G.O.MS నంబర్ 67, వాటర్ రిసోర్స్ (రిఫార్మ్స్) తేదీ: 16.08.2019 ప్రకారం రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయడంతోపాటు, అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలోని పనులను పిలువడం, ఖరారు చేయడం, అప్పగించడం వంటి వాటిలో రివర్స్ టెండరింగ్‌కు బదులుగా సాంప్రదాయ టెండర్ ప్రక్రియను అమలు చేయడానికి చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

4. పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణః

పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం. ప్రస్తుత పనులు చేపడుతోన్న కాంట్రాక్టు సంస్థతోనే పనులు కొనసాగించేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఏజెన్సీలు తమ అగ్రిమెంట్ల రేట్లు, ఒప్పందాల ప్రకారం పనులు కొనసాగిస్తూ 6000 క్యూసెక్కుల సామర్థ్యమున్న పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను పూర్తి చేసేందుకు తయారుచేసిన సమగ్ర ప్రణాళికకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఎడమ కాలువ పనులకు సంబంధించిన ప్రీ-క్లోజ్డ్ ప్యాకేజీలలో మిగిలిన బ్యాలెన్స్ పనుల నుండి అవసరమైన / క్లిష్టమైన పనులను రూ. 1226.68 కోట్ల అంచనా వ్యయంతో SoR 2024-25 లో ఎల్ఎస్ విధానంలో టెండర్లు పిలిచేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వర్షాలు బాగా కురుస్తున్నందున ప్రస్తుత సీజన్ లో అన్ని రిజర్వాయర్లు, చెరువులు నిండే విధంగా ప్రణాళికాబద్దమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖకు ముఖ్యమంత్రి నిర్దేశించారు.

అలాగే, విశాఖపట్నం ప్రజలకు తాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీరు అందించేందుకు అవకాశం కలుగుతుంది. విశాఖపట్టణానికి మొదట లిప్ట్ విధానంలో నీరు అందిస్తాం.. పోలవరం పూర్తైన తర్వాత గ్రావిటీ ద్వారా పూర్తిస్థాయిలో నీరు అందిస్తాం. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యమైపోయాయి. తుంగభద్ర గేటు కొట్టుకుపోయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమయస్ఫూర్తితో కర్ణాటక ప్రభుత్వం సమన్వయంతో 3 రోజుల్లోనే సమస్యను పరిష్కరించాం.ఇందుకుగాను సీఎం చొరవకు కేబినెట్ ప్రత్యేక అభినందనలు తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్టులను సమగ్రంగా పరిశీలించి అవసరమైన మేరకు మరమ్మత్తులు చేపట్టాలని మంత్రి మండలి నిర్ణయించింది.

5. 73 ఏళ్ళ జీవిత ఖైదు విడుదల ప్రతిపాదనః

తేదీ 16.08.2021న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుల మేరకు G.O.Ms.No.91, హోం (పెరోల్స్ & హెచ్‌ఆర్‌సి) డిపార్ట్‌మెంట్ ఉత్తర్వుల ప్రకారం అనంతపురంలోని వ్యవసాయ కాలనీలోని జైళ్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీ నెం.4461, 73 ఏళ్ళ కొండూరు రామ చంద్రారెడ్డి ముందస్తు విడుదలకు ప్రత్యేక రిమిషన్ మంజూరు కోసం చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. తద్వారా బాహ్య ప్రపంచానికి, జైల్లో గడిపిన రోజులకు మధ్య అంతరం తెలుసుకుని సమాజంలో కలిసి పోయే తత్వం పెరుగుతుందన్న భావనను మంత్రివర్గం అభిప్రాయపడింది.

6. ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణః

ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో రద్దు చేస్తూ తీర్మానించింది. 2019 కి ముందు ఎగ్జిక్యూటివ్, ఎన్ ఫోర్స్ మెంట్, డిస్టిలరీ వింగ్ లు ఒకే లైన్ ఆఫ్ కంట్రోల్ లో ఉంటూ సమర్థవంతంగా పనిచేసేవి. 2020 మే లో స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో ఏర్పాటుతో ఎక్సైజ్ సిబ్బందికి, సెబ్ కి మధ్య సమన్వయలోపం ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం నియంత్రణ, నాన్-డ్యూటీ పెయిడ్ మద్యం మొదలైన నేరాల నియంత్రణపై పట్టు కోల్పోవడంతో 2019 – 24 మధ్య కాలంలో ఎన్డీపీఎల్ నేరాల సంఖ్య 66 శాతానికి పెరిగింది.

కేరళ, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించిన అధ్యయన బృందం ఆయా రాష్ట్రాల్లో ఒకే లైఫ్ లైన్ తో పనిచేస్తున్న ఎక్సైజ్ శాఖ తీరును పరిశీలించి బాగుందని తెలిపింది. ఈ నేపథ్యంలో సెబ్ లోని సిబ్బందిని ఎక్సైజ్ శాఖలో ఉంచాలని ప్రతిపాదన చేసింది. గత ప్రభుత్వం సెబ్‌ను ఆదాయం పెంచుకునేందుకు వినియోగించలేదని కేబినెట్ అభిప్రాయపడింది. గత ఎక్సైజ్ విధానం వల్ల రాష్ట్రానికి రూ.18,860 కోట్లు నష్టం వాటిల్లిందని, సరియైన నియంత్రణ లేని కారణంగా రాష్ట్రానికి తీవ్రనష్టం వాటిల్లినట్లు కేబినెట్ పేర్కొంది. అలాగే ప్రజల ఆరోగ్యాలు కూడా దెబ్బతిన్నాయని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఈ ఈ నేపథ్యంలో నూతన ఎక్సైజ్ పాలసీ తీసుకురావాలని మంత్రివర్గానికి సీఎం సూచించారు.

7. పట్టాదారు పాసుపుస్తకాలపై మార్పులు చేర్పులుః

పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్ పేరు, బొమ్మలు, రాజకీయ పార్టీల లోగో తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 21.86 లక్షల పట్టాదారు పాసుపుస్తకాలపై కొత్తగా రాజముద్ర ముద్రించి ఇవ్వడానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. 77 లక్షల సర్వే రాళ్ళపై మాజీ సీఎం జగన్ బొమ్మ తొలగించి వాటిని వినియోగించుకునేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 22 ఏ, ఫ్రీ హోల్డ్ భూములు వివాదాలపై రెవెన్యూ సదస్సుల నిర్వహణకు మంత్రిమండలి ఆమోదించింది. వివాదాలలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేతకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అలాగే, ప్రస్తుతం ఫైళ్ల దగ్ధం ఘటనలను కూడా దృష్టిలో ఉంచుకొని 29 లక్షల ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ పై విచారణ చేపట్టాం. వీటిలో 16.66 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయినట్లు విచారణలో తేలింది. అలాగే ఫ్రీహోల్డ్ లో ఉన్న 25,230 ఎకరాలు రిజిస్ట్రేషన్ జరిగినట్లు రెవెన్యూ శాఖ గుర్తించింది. ఈ నేపథ్యంలో అన్యాక్రాంతమైన భూములపై గ్రామ సభల్లో చర్చించి, అవి ఎలా అన్యాక్రాంతమయ్యాయో తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ కూడా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. భవిష్యత్ లో భూముల రికార్డులు తారుమారు కాకుండా మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం కేబినెట్ కు సూచించారు.

8. కొత్తగా రేషన్ దుకాణాల ఏర్పాటుః

కొత్తగా 2,774 రేషన్ దుకాణాల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పాటు చేసిన రేషన్ షాపుల్లో ఈ -పోస్ మిషన్ ల కొనుగోలుకు సంబంధించి రూ. 11.51 నిధుల విడుదల చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

9.సాధారణ పరిపాలన శాఖ (రాటిఫికేషన్):

వివిధ శాఖల్లో మంత్రుల పేచీల్లో పని చేసే వ్యక్తిగత సిబ్బంది పీఏల జీతం 18,000 నుండి 36,000 కు, పీఎస్ ల జీతం 50,000లకు పెంచాలని చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

10. సాధారణ పరిపాలన శాఖ (ఉద్యోగాల సృష్టి):

ప్రతి మంత్రికి నలుగురు చొప్పున (ఒక పీఆర్వో, ఒక విజన్ మెయింటెనెన్స్ అధికారి, సోషల్ మీడియా మేనేజర్స్ ఇద్దరు) మొత్తం 96 పోస్టులను మంజూరు చేయాలన్న ప్రతిపాదనకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. 3 వారాల్లో సంబంధిత నియామకాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

11. ఇండస్ట్రీ అండ్ కామర్స్ః

కృష్ణపట్నం ఇండ్రస్ట్రియల్ సిటీ డెవలప్ మెంట్ లిమిటెడ్ (NICDIT) పేరును ఏపీ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (AP – ICIDCL) గా, ఓర్వకల్లు, కొప్పర్తి నోడ్ లకు కూడా పేర్లు మార్చాలని నిర్ణయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

12. ఇసుక పాలసీః

ఇసుక పాలసీని పునరుద్ధరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సులభతర, సమర్థవంతమైన విధానానికి చేసిన ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. డిజిటల్ విధానం ద్వారా ఇసుక బుకింగ్, ఇసుక లభ్యతను మెరుగుపరచడం, వినియోగదారులకు రవాణాను సులభతరం చేయడం, కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం వంటి ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించింది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఇసుకకు ఇబ్బందులు ఏర్పడ్డాయన్నారు.

13. వికసిత్ ఆంధ్ర @ 2047:

విజన్ డాక్యుమెంట్ రూపకల్పన లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులను చేయాలని, వారి సలహాలు, సూచనలు ప్రతిబింబించే విధంగా, ప్రతి వర్గం అభివృద్ధి చెందేలా విజన్ డాక్యుమెంట్ కు రూపకల్పన చేయాలని కేబినెట్ కు ముఖ్యమంత్రి సూచించారు. దీని కోసం గ్రామ సభలు నిర్వహించి ప్రజల ఆకాంక్షలు, అవసరాలు, ఆలోచనలు తెలుసుకోవాలని ముఖ్యమంత్రి కేబినెట్ ను ఆదేశించినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..
ఆ స్టార్ హీరో సినిమాలో శివ కార్తికేయన్ స్పెషల్ రోల్‌!
ఆ స్టార్ హీరో సినిమాలో శివ కార్తికేయన్ స్పెషల్ రోల్‌!
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!