Andhra Pradesh: భార్య అతనితో కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. ఆ తర్వాత అరగుండు గీసి, తాళ్లతో కట్టేసి..

సహించాడు.. ఒపికపట్టాడు.. పెళ్లైంది.. తప్పుడు మార్గంలో నడవొద్దంటూ చెప్పాడు.. ఎన్నోసార్లు సముదాయించాడు.. అయినా అతని భార్య.. భర్తను ఏమాత్రం లెక్కచేయలేదు.. చివరకు ఆమె తప్పుడు మార్గాన్నే ఎంచుకుంది.. ప్రియుడితో కలిసి గుట్టుగా అక్రమసంబంధం కొనసాగిస్తూ వచ్చింది. చివరకు భార్య ఆమె ప్రియుడు ఇద్దరూ ఒకే చోట ఉండగా..

Andhra Pradesh: భార్య అతనితో కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. ఆ తర్వాత అరగుండు గీసి, తాళ్లతో కట్టేసి..
illegal affair

Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 04, 2023 | 5:01 PM

సత్యసాయి జిల్లా, సెప్టెంబర్ 04: సహించాడు.. ఒపికపట్టాడు.. పెళ్లైంది.. తప్పుడు మార్గంలో నడవొద్దంటూ చెప్పాడు.. ఎన్నోసార్లు సముదాయించాడు.. అయినా అతని భార్య.. భర్తను ఏమాత్రం లెక్కచేయలేదు.. చివరకు ఆమె తప్పుడు మార్గాన్నే ఎంచుకుంది.. ప్రియుడితో కలిసి గుట్టుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. చివరకు భార్య ఆమె ప్రియుడు ఇద్దరూ ఒకే చోట ఉండగా.. భర్త వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.. భార్యా, ప్రియుడిని అరగుండు కొట్టించి ఊరేగించాడు.. ఈ షాకింగ్ ఘటన ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో చోటుసుకుంది. లేపాక్షి మండలం ఇందిరమ్మ కాలనీలో అక్రమ సంబంధం కొనసాగిస్తుందని భర్త.. భార్యకు అరగుండు చేయించాడు.. అక్రమ సంబంధం కొనసాగిస్తుందని భార్యకు, ప్రియుడికి భర్త, అత్తమామలు అరగుండు చేసిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. పరిగి మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన హుస్సేన్ అనే వ్యక్తితో తిలక్ నగర్‌కు చెందిన మహిళ అక్రమ సంబంధం కొనసాగిస్తుందని భర్త ఆరోపిస్తున్నాడు..

ఈ క్రమంలో భార్య, ప్రియుడు ఒకే చోట ఉన్నారన్న పక్కా సమాచారంతో భర్త, అతని కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. అనంతరం ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత భర్త, అత్తమామలు కలిసి.. ప్రియుడు, ప్రియురాలు.. ఇద్దరికీ అరగుండు గీయించి, మెడలో చెప్పుల దండ వేసి చేతులను తాళ్ళతో కట్టేసి ఊరేగించారు. తప్పుడు మార్గంలో నడవొద్దని పలు మార్లు హెచ్చరించినా వినకపోవడంతో భార్యకు అరగుండు, ప్రియుడికి అరగుండుతోపాటు సగం మీసం తీసి బుద్ది చెప్పానని.. భర్త పేర్కొన్నాడు.

ఎన్నిసార్లు చెప్పినా ఇద్దరూ పద్దతి మార్చుకోకపోవడంతో భార్యను, ఆమె ప్రియుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు భర్త.. అతని కుటుంబసభ్యులు తెలిపారు. తన కుటుంబ సభ్యులతో కలిసి భార్య, ప్రియుడికి తగిన బుద్ది చెప్పానని భర్త పేర్కొన్నాడు. కాగా.. ఈ అరగుండు ఘటనపై భార్య, ప్రియుడు హుస్సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..