Andhra Pradesh: అడుగు పెడితే అదే ఆఖరి రోజు.. దుంగల దొంగలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్‌

ఎర్రచందనం దుంగలను ఎత్తుకుపోతున్న అడవి దొంగలకు.. ఖబడ్దార్ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు. శేషాచలం అడవిలో అడుగు పెడితే అదే మీకు ఆఖరి రోజు అంటూ హెచ్చరించారు. సరికొత్త ఆయుధంతో స్మగ్లర్లను వేటాడతామన్నారు బాబు.

Andhra Pradesh: అడుగు పెడితే అదే ఆఖరి రోజు.. దుంగల దొంగలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్‌
CM Chandrababu Naidu
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 31, 2024 | 8:41 AM

తిరుమల శ్రీనివాసుడి పాదాల చెంత ఉన్న శేషాచలం అడవిలోకి చొరబడి ఎర్ర చందనం దుంగలను తరలించుకుని పోతున్న స్మగ్లర్ల ఆట ఇక కట్టవనుంది. ఇన్నాళ్లు ఒక లెక్క, ఇక ముందు నుంచి మరో లెక్క అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.. శేషాచలం అడవిలో అడుగు పెడితే ఇక అంతే సంగతులంటూ వార్నింగ్ ఇచ్చారు. అడవులను నరికేసి, ఎర్రచందనం దుంగలను కొట్టేస్తున్న రెడ్‌ శాండల్‌ స్మగ్లర్లను వేటాడడానికి…ఇక డ్రోన్లను రంగంలోకి దింపనుంది ఏపీ సర్కార్‌. దుంగల దొంగలు అడవి లోకి అడుగు పెట్టగానే, డ్రోన్లు వాళ్లను వెంటాడుతాయి. ఆ సమాచారాన్ని అటవీ, పోలీస్‌ శాఖలకు చేరవేస్తాయి. దీంతో అడవిలో అడుగు పెడితే అడవి దొంగల పని అయిపోయినట్లే. నాన్‌స్టాప్‌గా సాగుతున్న రెడ్ శాండల్‌ స్మగ్లింగ్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టడానికి బాబు సర్కార్‌.. డ్రోన్‌ స్ట్రాటజీతో ముందుకు వెళ్లనుంది. రెడ్‌ శాండల్ స్మగ్లర్స్‌కు డ్రోన్లతో చెక్‌ పెడతామన్నారు చంద్రబాబు. ఇన్నాళ్లు మీరు ఆటాడారు. ఇప్పుడు మా డ్రోన్లతో వేటాడుతాం, ఖబడ్దార్‌ అంటూ పేర్కొన్నారు.

ఇక కొద్ది రోజుల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కూడా ఇదే విషయంపై మాట్లాడారు. రెడ్ శాండల్‌ స్మగ్లర్ల విషయంలో ఇన్నాళ్లు ఒక లెక్క…ఇక నుంచి మరో లెక్క అంటున్నారు పవన్‌. దుంగల్‌ – దొంగల్‌ బ్యాచ్‌ భరతం పడతామన్నారు. ఇన్నాళ్లు చిన్న తలకాయల అరెస్టులతో సరిపెట్టిన అధికారులు…ఇక బడా స్మగ్లర్ల అంతు చూడాలని అటవీశాఖను ఆదేశించారు డిప్యూటీ సీఎం.

చంద్రబాబు సీరియస్‌గా దృష్టి సారించిన నేపథ్యంలో….రెడ్‌ శాండల్‌ స్మగ్లర్లపై డ్రోన్లతో ఉక్కుపాదం మోపేందుకు అటవీ శాఖ సిద్ధమవుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..