Andhra pradesh: అనాథ మృతదేహానికి హిందూ సంప్రదాయం ప్రకారం ముస్లిం యువకులు అంత్యక్రియలు

|

Feb 19, 2023 | 12:15 PM

మతం కంటే మానవత్వం గొప్పదని నిరూపించిన ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి అనంతపురం జిలాల్లో చోటు చేసుకుంది. అనాధ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు ముస్లిం యువకులు.

Andhra pradesh: అనాథ మృతదేహానికి హిందూ సంప్రదాయం ప్రకారం ముస్లిం యువకులు అంత్యక్రియలు
Humanity
Follow us on

మంచితనం మానవత్వం నుంచి మతం చిన్నబోయింది. ఎవరూ లేని అనాథ మరణిస్తే.. అన్నీ తామై అంతిమయాత్రకు నిర్వహించారు కొందరు యువకులు. అది కూడా హిందూ సంప్రదాయాన్ని అనుసరించి అంత్యక్రియలు చేశారు కొందరు ముస్లిం యువకులు.. మతం కంటే మానవత్వం గొప్పదని నిరూపించిన ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి అనంతపురం జిలాల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

అనాధ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు ముస్లిం యువకులు. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం వెంగళమ్మ చెరువులో జరిగింది. చెండ్రాయుడు అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. అతని అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తులు ముందుకు రాలేదు. అది చూసిన కొంతమంది ముస్లిం యువత నడుంబిగించారు. విషయం తెలుసుకుని చెండ్రాయుడు మృత దేహాన్ని వైకుంఠ రథంలో  స్మశానికి తరలించారు. అక్కడ భారతీయ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు ఆ ముస్లిం యువకులు. యువకులు చేసిన మంచి పనిని అభినందించారు స్థానికులు. ఇలాంటి యువత తమ గ్రామంలో ఉండడం గౌరవంగా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపించారు గ్రామస్తులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..