Andhra Pradesh: కచ్చిడి చిక్కింది.. సిరులు తెచ్చింది.. లక్షన్నర కొన్న వ్యాపారి.. ఎంతకు అమ్మాడో తెలిస్తే షాకే
Variety Fish: మత్స్యకారుల వలకు భారీ కచ్చిడి చేప చిక్కింది. దీనిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీ పడ్డారు. ఆడ, మగ చేపల్లో.. ఈ రకం మగ చేపకు భారీ డిమాండ్ ఉంటుంది. ఈ చేప ప్రత్యేకతలు తెలుసుకుందా పదండి..
West Godavari District: ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో కచ్చిడి చేప బాగా ఫేమస్ అయింది. అందుకు కారణం దాని ధర. ఈ రకం చేప జాలర్లకు అరుదైగా చిక్కుతుంది. ధర అయితే లక్షల్లో పలుకుతుంది. మగ చేప అయితేనే మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఈ చేప పొట్టలోని తిత్తులు ఔషధాల తయారీలో ఉపయోగిస్తారట. సర్జరీ చేశాక కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్ బ్లాడర్‌తో తయారు చేస్తారని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. ఖరీదైన వైన్ తయారీలోనూ ఈ ఫిష్ శరీర భాగాలను వినియోగిస్తుంటడంతో డిమాండ్ రెట్టింపయ్యింది. దీనిని గోల్డెన్ ఫిష్(Golden Fish) అని కూడా పిలుస్తారు. నిజంగానే ఈ చేప దొరికితే మత్స్యకారులు తమకు బంగారం దొరికనట్టే అని భావిస్తారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం(Narasapuram) తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు 18 కిలోల కచ్చిడి చేప చిక్కింది. దీనిని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది రేవు వద్ద సోమవారం అమ్మకానికి పెట్టగా.. నరసాపురానికి చెందిన వ్యాపారి శ్రీనివాసరావు లక్షన్నరకు కొనుగోలు చేశాడు. ఆపై ఈ చేపను కోల్‌కతాలోని ఓ ఫిష్ ఎక్స్‌పోర్ట్ సెంటర్‌కి లక్షన్నరకు విక్రయించాడు. అక్కడి నుంచి ఈ చేపను చైనాకు ఎగుమతి చేస్తారని వ్యాపారి తెలిపాడు. కేవలం కోల్‌కతాకు తరలించినందుకు ఈ వ్యాపారికి 50 వేలు లాభం దక్కింది. గట్టిగా అనుకున్నా ఖర్చులు 10 వేలకు మించి అవ్వవు. నికరంగా వ్యాపారికి 40 వేలు లాభం దక్కినట్లే. అందుకే ఇలాంటి చేప ఒక్కటి వలలో చిక్కినా తమ పంట పండినట్టే అని మత్స్యకారులు చెబుతుంటారు. కాగా ఈ చేప ఎక్కడా ఓ చోట స్థిరంగా ఉండదు. ఒక చోట నుంచి మరో చోటికి ఎప్పుడూ ప్రయాణిస్తూనే ఉంటుంది. అందుకే వలకు చిక్కడం అరుదు.
Also Read: Telangana: అక్కడ చిలక తాగిన తాటికల్లుకు యమ డిమాండ్.. బుక్ చేసుకుంటేనే దొరుకుతుంది