AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అక్కడ చిలక తాగిన తాటికల్లుకు యమ డిమాండ్.. బుక్ చేసుకుంటేనే దొరుకుతుంది

Peddapalli District: చిలక కొట్టిన పండుకే కాదు.. చిలక తాగిన తాటికల్లు సైతం యమ టెస్ట్ గా ఉంటాయట. చిలక తాగిన కల్లుకు భారీ డిమాండ్ ఉండడంతో ఫోన్ చేసి మరి బుక్ చేసుకుంటారట. అదేక్కడో తెలుసుకుందాం పదండి.

Telangana: అక్కడ చిలక తాగిన తాటికల్లుకు యమ డిమాండ్.. బుక్ చేసుకుంటేనే దొరుకుతుంది
Toddy
Ram Naramaneni
| Edited By: |

Updated on: Feb 09, 2022 | 12:09 PM

Share

Variety toddy: చిలక కొట్టిన పండంటే వెనకముందు చూడకుండా తినేస్తారు పండ్ల ప్రియులు. ఎందుకంటే అది యమ టెస్ట్ గా ఉంటుందనేది అందరికి తెలిసిందే. అలాంటి చిలక కొట్టిన పండును ఎవరికి ఇచ్చిన వద్దనకుండా తినేస్తుంటారు. అయితే తాజాగా చిలక తాగిన తాటి కల్లు ప్రచారం లోకి వచ్చాయి. అంతేకాదు అది యమా టెస్ట్ గా ఉండడంతో ముందుగానే ఫోన్ చేసి మరి బుక్ చేసుకుంటున్నారు కల్లు ప్రియులు. తాటి వనంలో రామ చిలుకలు తాగిన కల్లు కోసం ఎగబడుతున్నారు కల్లు ప్రియులు. ఈ క్రేజీ కల్లు వనం పెద్దపల్లి జిల్లా(Peddapalli district) సుల్తానాబాద్(Sultanabad) మండలం నీరుకుళ్ల గ్రామంలో ఉంది. రామ చిలుకలు ఎంగిలి చేసిన కల్లు మధురంగా ఉంటుందని చెబుతున్నారు కళ్లు ప్రియులు. తాటిచెట్టు నుండి వచ్చే కల్లును రామచిలుకలు మొదటగా సేవిస్తాయని.. అందుకే చిలకమ్మ ఎంగిలి తాటి కల్లు ఎంతో మధురంగా.. చాలా తియ్యగా ఉంటుందని గొప్పగా చెప్పారు కల్లు ప్రియులు. ఈ సీజన్లో రామచిలుకలు తాటికల్లును ఎక్కువగా సేవిస్తాయని.. అందుకే ఈ సీజన్లో రామచిలుకలు ఎంగిలి చేసిన కల్లు తాగేందుకు రెండ్రోజుల ముందుగానే ఫోన్ చేసి మరీ బుక్ చేసుకుంటున్నారని చెప్పారు కల్లు దుకాణదారులు.

రామ చిలుకలు ఎంగిలి కల్లును తాగేందుకు ఒక్క పెద్దపల్లి జిల్లా వాసులే కాకుండా.. పొరుగు జిల్లాల నుండి కూడ కల్లు ప్రియులు పెద్ద సంఖ్యలో వచ్చి సేవిస్తున్నారని చెబుతున్నారు కల్లు దుకాణాదారులు. డిమాండ్‌ను బట్టి రేటు కూడా కాస్త ఎక్కువే. అంతేకాదు ఈ కల్లు ఏడాదిలో రెండు నెలల పాటే దొరుకుతుందట. ఇంకేందుకు ఆలస్యం.. కల్లు ప్రియులూ.. అటువైపు ఓ లుక్కేయండి.

Also Read: దానికీ ప్రాణముందిగా.. టిక్కెట్ కొట్టాల్సిందేనన్న కండక్టర్.. ఆ తరువాత ఏం జరిగిందంటే..!

Follow Us
ఫిల్మ్ ఇండస్ట్రీకి మోదీ గుడ్‌న్యూస్!ఇక ఊరూరా థియేటర్లే!
ఫిల్మ్ ఇండస్ట్రీకి మోదీ గుడ్‌న్యూస్!ఇక ఊరూరా థియేటర్లే!
సమంత ప్రెగ్నెంట్ అని తెలిశాకే.. ఆ సీన్లన్నీ షూట్ చేశాం..
సమంత ప్రెగ్నెంట్ అని తెలిశాకే.. ఆ సీన్లన్నీ షూట్ చేశాం..
OTT గైడ్.. పెద్ది, అబ్సెషన్ తో పాటు.. ఈ వారం ఏం వస్తున్నాయంటే
OTT గైడ్.. పెద్ది, అబ్సెషన్ తో పాటు.. ఈ వారం ఏం వస్తున్నాయంటే
10th కూడా పాస్ కాలేదు.. కట్ చేస్తే.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్
10th కూడా పాస్ కాలేదు.. కట్ చేస్తే.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్
డేట్, టైమ్, లొకేషన్ ఫిక్స్.. పొలిటికల్ వార్‌కు వచ్చేదెవరు?
డేట్, టైమ్, లొకేషన్ ఫిక్స్.. పొలిటికల్ వార్‌కు వచ్చేదెవరు?
ఏడుస్తున్న పిల్లలను వాషింగ్ మెషీన్‌లో పెట్టి లాక్.. జెట్ స్ప్రేతో
ఏడుస్తున్న పిల్లలను వాషింగ్ మెషీన్‌లో పెట్టి లాక్.. జెట్ స్ప్రేతో
ఇంగ్లాండ్ సిరీస్‌లో ఈ ముగ్గురికి అగ్నిపరీక్ష..
ఇంగ్లాండ్ సిరీస్‌లో ఈ ముగ్గురికి అగ్నిపరీక్ష..
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు ప్రభుత్వం తెలిపిన 8 అభ్యంతరాలు ఇవే
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు ప్రభుత్వం తెలిపిన 8 అభ్యంతరాలు ఇవే
కోట్లాది డాలర్లు, వందల కేజీల బంగారం.. జనం సొమ్ము దోచేశారు!
కోట్లాది డాలర్లు, వందల కేజీల బంగారం.. జనం సొమ్ము దోచేశారు!
నోట్లో కరిగిపోయే కమ్మనైన పేదోళ్ల పచ్చి కొబ్బరి పాయసం..
నోట్లో కరిగిపోయే కమ్మనైన పేదోళ్ల పచ్చి కొబ్బరి పాయసం..