ఈ కాలంలో రూపాయి రోడ్డు మీద కనిపించినా వెంటనే దానిని తీసి జేబులో పెట్టుకునే వాళ్ళు చాలామందే ఉన్నారు. అదే బంగారం, వెండి ఉన్న బ్యాగు కళ్ళ ముందు కనిపిస్తే..? పైగా అందులో నగదు కూడా ఉంటే… ఆ బ్యాగును చూస్తే చాలామందికి దానిని సొంతం చేసుకోవాలనే ఆలోచన రాక మానదు కదా…? అయితే పరుల సొమ్ము పాము వంటిది అన్న సామెతను జీవితంలో అన్వహించుకున్నాడు విశాఖలో ఓ ఆటో డ్రైవర్.. నీతినిజాయతీ కలిగిన వ్యక్తిగా ప్రశంసలను అందుకుంటున్నాడు.. వివరాల్లోకి వెళ్తే..
బుధవారం సాయంత్రం నాలుగున్నర ప్రాంతం విశాఖ భీమిలి నుంచి ఆటో ఎక్కింది ఓ మహిళ. ఎంవిపి కాలనిలో దిగాల్సి ఉంది. పాసింజర్ ఆటో లో బయలుదేరి ఎంవీపి సర్కిల్ వద్ద ఆటో దిగిపోయింది. ఈ సమయంలో తనతో తెచ్చుకున్న బ్యాగు ఆటోలో మర్చిపోయింది. కొంత సమయం తర్వాత తాను బ్యాగు మరిచిపోయిన విషయాన్ని గుర్తించి అవాక్కయింది. ఎందుకంటే ఆ బ్యాగులో బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతో పాటు నగదు కూడా ఉంది. ఒక్కసారిగా తాను పోగొట్టుకున్న బ్యాగ్ విలువ గుర్తుకు తెచ్చుకుని గుండె దడతో ఆ మహిళ ఎంవిపి పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలు ఫిర్యాదుతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. మహిళ తెలిపిన వివరాలు ఆధారంగా డీ కోల్డ్ కానిస్టేబుల్ హరి కి ఆటో ట్రాక్ చేయాలని బాధితులు అప్పగించారు. దీంతో హుటాహుటిన ఆటో స్టాండ్ కు వెళ్లిన హరి అక్కడ మరో ఆటో డ్రైవర్ సత్యనారాయణకు విషయాన్ని చెప్పారు. ఆ ఆటో కొండలరావు అలియాస్ రాజుది అయి ఉండొచ్చని అనుమానించారు. వాళ్ల అనుమానం నిజమే అయింది. రాజు కోసం.. ట్రాక్ చేసే పని ప్రారంభించారు పోలీసులు. మరోవైపు సత్యనారాయణ కూడా.. పోలీసులకు సహకరించాడు. ఇంతలో.. కొండలరావు అలియాస్ రాజుకు కాంట్రాక్ట్ అయ్యేసరికి.. ఆ బ్యాగు తన దగ్గరే ఉందని.. స్వచ్ఛందంగా తిరిగి అప్పగించేందుకు వస్తున్నట్లు తెలుసుకున్నారు. గంట వ్యవధిలోనే ఇదంతా జరిగిపోయింది. సేఫ్ గా బ్యాగు పోలీసుల చేతికి చిక్కింది. బ్యాగులో ఉన్న బంగారు వెండి వస్తువులతో పాటు నగదు కూడా అలాగే ఉంది.
బంగారం వెండి నగరంలో ఉన్న ఆ బ్యాగును.. విశాఖ సిటీ రవిశంకర్ అయ్యనార్ బాధితురాలికి అందజేశారు. దీంతో పాటు.. స్వచ్ఛందంగా బ్యాగు తీసుకొచ్చి ఇచ్చిన ఆటో డ్రైవర్ రాజును, పోలీసులకు సహకరించిన మరో ఆటో డ్రైవర్ సత్యనారాయణకు సీపీ అభినందించి క్యాష్ రివార్డులను అందించారు. అలాగే సమాచారం అందుకున్న గంటలోనే బ్యాగు దొరికి సేఫ్ గా చేరేందుకు శ్రమించిన పోలీస్ కానిస్టేబుల్ హరిని కూడా మెరిట్ సర్టిఫికెట్ ఇచ్చి ప్రోత్సహించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..