AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్షసూచన

దిశగా కదులుతోంది. రుతుపవనాలు మరింత చురుగ్గా మారాయి. రెండు రోజులపాటు ఏపీలో చాలా చోట్ల కుండపోత వర్షాలు కురుస్తాయి. ఐదు రోజులపాటు విస్తారంగా వర్షాలు పడతాయి. కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు మరికొన్నిచోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయి

AP Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్షసూచన
Andhra Weather Report
Maqdood Husain Khaja
| Edited By: Ram Naramaneni|

Updated on: Jul 18, 2024 | 2:56 PM

Share

మధ్య బంగాళాఖాతము, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాత ప్రాంతంలో ఈరోజు అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం మధ్య-ట్రోపోఆవరణము వరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళే కొలది నైరుతి వైపు వంగి ఉంటుంది . ఇది మరింత గుర్తించబడిన అల్పపీడనముగా బలపడి రాబోయే 2 రోజుల్లో వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు కదులుతుంది. బుధవారం నాటి ఋతుపవన ద్రోణి సగటు సముద్ర మట్టం వద్ద ఇప్పుడు జైసల్మేర్, కోట, గుండా వెళుతుంది. గుణ, మండల, పెండ్ర రోడ్డు, గోపాల్‌పూర్ ఆగ్నేయ దిశగా మధ్య బంగాళాఖాతము, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాత ప్రాంతంలో ఉన్న అల్పపీడన ప్రాంతం వరకు… సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు వరకు విస్తరించి ఉంది. బుధవారం నాటి షీర్ జోన్/ గాలుల కోత సుమారుగా 20°N సగటున సముద్ర మట్టానికి 3.1 & 5.8 కి.మీ మధ్య ఎత్తుతో దక్షిణం వైపు వంగి ఉంటుంది. ఈ క్రమంలో రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

————————————————

గురువారం, శుక్రవారం:-

తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశము ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది .బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

శనివారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్లతో పాటు భారీ వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశము ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది .బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ ;-

…………………………………………….

గురువారం:- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది .బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

శుక్రవారం ;- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటరుల వేగముతో వీచే అవకాకాశముంది.

శనివారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

రాయలసీమ :-

…………………………

గురువారం:- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

శుక్రవారం :- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

శనివారం:- తేలికపాటి నుండి మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు ౩౦-40 కిలోమీటర్ల వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

అత్యంత భారీ వర్షాలు..

గురువారం ఏలూరు, అల్లూరి జిల్లా, కొనసీమ, వేస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తాయి. కృష్ణ ఎన్టీఆర్ అనకాపల్లి విశాఖ విజయనగరం పార్వతీపురం మన్యం శ్రీకాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయి. పల్నాడు గుంటూరు బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని టీవీ9 తో విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి కెవిఎస్ శ్రీనివాస్ అన్నారు.

శుక్రవారం ఆ జిల్లాల్లో…..

రేపు ఏలూరు అల్లూరి జిల్లాలో కుండపోత వర్షాలు కురస్తాయి. పల్నాడు ఎన్టీఆర్ గుంటూరు కృష్ణ పార్వతీపురం మన్యం శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కోనసీమ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయి. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి.. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని అన్నారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే