Janasena: జనసేన సభ్యత్వం తీసుకున్న వారికి రూ.5 లక్షల బీమా

Janasena: జనసేన సభ్యత్వం తీసుకున్న వారికి రూ.5 లక్షల బీమా

Ram Naramaneni

|

Updated on: Jul 18, 2024 | 1:31 PM

జులై 18 నుంచి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది జనసేన పార్టీ. తొమ్మిది లక్షల క్రియాశీల సభ్యత్వాన్ని సాధించడమే పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు.

మంగళగిరి జనసేన కేంద్ర కార్యలయంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రారంభించారు. జనసేన సభ్యత్వం తీసుకున్న వారికి రూ.5 లక్షల బీమా సభ్యత్వంతో పాటు కుటుంబసభ్యులకు బీమా రక్షణ కల్పిస్తున్నారు. జులై 18 నుంచి 28 వరకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగనుంది.

టీడీపీ, బీజేపీలతో కలిసి జనసేన కార్యకర్తలు పనిచేయాలని.. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని నాదెండ్ల పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు పార్టీ వీడి వెళ్లిన వారిపై నాదెండ్ల పరోక్ష కామెంట్స్‌ చేశారు. వ్యక్తుల వల్ల పార్టీ నడవదని, వ్యక్తిగత ప్రయోజనాలతో ముందుకెళ్తే వారికే నష్టమని నాదెండ్ల మనోహర్ అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..