AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది కదా సూపర్ కూల్ న్యూస్ అంటే.. ఏపీలో ఫుల్‌గా వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో

దేశంలోని అనేక రాష్ట్రాలకు మాన్సూన్‌ హాయ్‌ చెబుతోంది. శాటిలైట్‌ చిత్రాన్ని పరిశీలిస్తే.. రెండ్రోజుల్లో మహరాష్ట్ర, తెలంగాణ, కర్నాటక, ఒడిశా, కోస్తాంధ్రల్లో భారీ వర్షాలు పడతాయి. ఉష్ణోగ్రత చూస్తే..తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఎండ ఉన్నా..మధ్యాహ్నం భారీ వర్షానికి చాన్స్‌ ఉంది. తెలంగాణలో.. ఆ వివరాలు..

ఇది కదా సూపర్ కూల్ న్యూస్ అంటే.. ఏపీలో ఫుల్‌గా వర్షాలు.. వెదర్ రిపోర్ట్ ఇదిగో
Rain Alert
Ravi Kiran
|

Updated on: Jun 14, 2024 | 9:02 AM

Share

దేశంలోని అనేక రాష్ట్రాలకు మాన్సూన్‌ హాయ్‌ చెబుతోంది. శాటిలైట్‌ చిత్రాన్ని పరిశీలిస్తే.. రెండ్రోజుల్లో మహరాష్ట్ర, తెలంగాణ, కర్నాటక, ఒడిశా, కోస్తాంధ్రల్లో భారీ వర్షాలు పడతాయి. ఉష్ణోగ్రత చూస్తే..తెలుగు రాష్ట్రాల్లో ఉదయం ఎండ ఉన్నా..మధ్యాహ్నం భారీ వర్షానికి చాన్స్‌ ఉంది. తెలంగాణలో పగటివేళ మాగ్జిమం 30 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో మాగ్జిమం 32 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తీరప్రాంతంలో వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ నెల 15 నుంచి రుతుపవనాలు చురుకుదనాన్ని సంతరించుకొనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. అదే సమయంలో ఇవి కోస్తాంధ్రలోని మిగిలిన ప్రాంతాలకు, ఒడిశా, వాయవ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతా­లకు విస్తరించనున్నాయి. ఫలితంగా ఈ నెల 15 నుంచి రాష్ట్రంలో విస్తారంగా వానలు కురవనున్నాయి.

తెలంగాణ విషయానికివస్తే, అల్పపీడన ద్రోణి కారణంగా హైదరాబాద్‌సహా అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ద్రోణి బలపడటం వల్ల కరీంనగర్‌, సిరిసిల్ల, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి. హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి చాన్స్‌ ఉంది..ఉదయం వేళ్లల్లో ఎండ ఉన్నప్పటికీ..మధ్యాహ్నం వర్షం కురిసే అవకాశముంది. మేఘాల వల్ల ఉక్కపోత కూడా ఉంటుంది.

ఇక ఏపీ విషయానికవస్తే.. విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, జిల్లాల్లో భారీ వర్షం పడనుంది. అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షం పడేటపుడు.. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలి. చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు.

ఇది చదవండి: మరీ ఇలా ఉన్నావ్.. ఇదేం కోరిక తల్లి.. ఆమె ఆశలు విన్నారంటే మగాళ్ల గుండెలు హడల్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..