AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండలో మార్చురీ గోడ పక్కనే నరకయాతన.. చివరికి ప్రాణాలు కోల్పోయిన అభాగ్యుడు!

గుంటూరు జీజీహెచ్‌లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కాలికి గాయంతో చికిత్స కోసం వచ్చిన సుమారు 40 ఏళ్ల అనాథను భద్రతా సిబ్బంది స్ట్రెచర్‌పై తీసుకెళ్లి మార్చురీ సమీపంలోని ప్రధాన గేటు బయట వదిలేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తీవ్ర నొప్పితో నడవలేని స్థితిలో ఎండలోనే పడివున్న అతడు.. స్థానికులు ఆహారం, మంచినీరు అందించినప్పటికీ పరిస్థితి విషమించి మరుసటి రోజు మృతి చెందాడు..

ఎండలో మార్చురీ గోడ పక్కనే నరకయాతన.. చివరికి ప్రాణాలు కోల్పోయిన అభాగ్యుడు!
Guntur GGH Tragedy
Srilakshmi C
|

Updated on: Oct 06, 2026 | 8:42 AM

Share

గుంటూరు, అక్టోబర్ 6: అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన ఓ అనాథను ఆదుకోవాల్సింది పోయి.. మార్చురీ గోడ పక్కన వదిలేసిన ఘటన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్‌)లో చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి ఎండలో గంటల తరబడి నరకయాతన అనుభవించి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

సుమారు 40 ఏళ్ల వయసున్న ఓ అనాథ కాలికి గాయం కావడంతో మూడు రోజుల క్రితం గుంటూరు జీజీహెచ్‌కు వచ్చాడు. అత్యవసర విభాగంలో వైద్యులు అతడిని పరీక్షించి కాలికి కట్టుకట్టి చికిత్స అందించారు. అయితే గాయం పూర్తిగా నయం కాకపోవడంతో తీవ్ర నొప్పితో బాధపడుతూ, నడవలేని స్థితిలో ఆసుపత్రి పరిసరాల్లోనే ఉండిపోయాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం జీజీహెచ్‌ సెక్యూరిటీ సూపర్‌వైజర్‌తో పాటు మరో ఇద్దరు భద్రతా సిబ్బంది అతడిని స్ట్రెచర్‌పై తీసుకెళ్లారు. అనంతరం మార్చురీ సమీపంలోని ప్రధాన గేటు బయట వదిలేసినట్లు స్థానికులు తెలిపారు. తీవ్ర బలహీనతతో ఉన్న అతడు అక్కడి నుంచి కదలలేక ఎండలోనే పడివుండిపోయాడు. అతడి పరిస్థితిని గమనించిన స్థానికులు మానవతా దృక్పథంతో ఆహారం, మంచినీరు అందించారు. అయినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో సోమవారం అతడు అక్కడే మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లేకపోవడంతో అతడి వివరాలు తెలియరాలేదు. ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చికిత్స కోసం వచ్చిన అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచాల్సింది పోయి ఆసుపత్రి బయట వదిలేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై జీజీహెచ్‌ సీఎస్‌ఆర్‌ఎంవో బి.వి.రావును వివరణ కోరగా.. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. మృతుడు యాచకుడిగా ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్పారు. అయితే చికిత్స పొందుతున్న వ్యక్తిని ఆసుపత్రి నుంచి బయటకు తరలించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అతడిని ఎవరి ఆదేశాలతో మార్చురీ సమీపంలో వదిలేశారు? అతడి ఆరోగ్య పరిస్థితిని సిబ్బంది ఎందుకు పట్టించుకోలేదు? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. విచారణ పూర్తయితే ఈ ఘటనకు బాధ్యులెవరో తేలే అవకాశం ఉంది.

Follow Us
ఎండలో మార్చురీ గోడ పక్కనే నరకయాతన.. చివరికి ప్రాణాలు కోల్పోయాడు
ఎండలో మార్చురీ గోడ పక్కనే నరకయాతన.. చివరికి ప్రాణాలు కోల్పోయాడు
భారీ గ్రహం చూపుతో వీరికి మహర్దశ.. అప్పుల నుంచి విముక్తి!
భారీ గ్రహం చూపుతో వీరికి మహర్దశ.. అప్పుల నుంచి విముక్తి!
2 కిలోమీటర్ల దూరానికి.. 30 నిమిషాలా?.. ఈ రూట్‌లో నరకం
2 కిలోమీటర్ల దూరానికి.. 30 నిమిషాలా?.. ఈ రూట్‌లో నరకం
ఇండస్ట్రీని ఏలిన అందమైన హీరోయిన్..
ఇండస్ట్రీని ఏలిన అందమైన హీరోయిన్..
భారత్ సారీ చెప్పాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి.. నఖ్వీ కొత్త నాటకం
భారత్ సారీ చెప్పాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి.. నఖ్వీ కొత్త నాటకం
మినప, పెసల కంటే 100 రెట్లు ఎక్కువ.. ఒక్కటి తిన్నా చాలు ఉల్లాసంగా
మినప, పెసల కంటే 100 రెట్లు ఎక్కువ.. ఒక్కటి తిన్నా చాలు ఉల్లాసంగా
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బొనాంజా.. ఎంత బోనస్ అంటే..
సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బొనాంజా.. ఎంత బోనస్ అంటే..
కంట్రోల్ తప్పిన కోపం.. చైనా ఓపెన్ నుంచి మెద్వెదేవ్ అవుట్
కంట్రోల్ తప్పిన కోపం.. చైనా ఓపెన్ నుంచి మెద్వెదేవ్ అవుట్
నగరంలో 6 కిమీ డబుల్‌ డెక్కర్ కారిడార్‌పై బిగ్‌ అప్‌డేట్
నగరంలో 6 కిమీ డబుల్‌ డెక్కర్ కారిడార్‌పై బిగ్‌ అప్‌డేట్
షుగర్‎ను కంట్రోల్ చేసే పవర్ఫుల్ మెడిసిన్.. ఒక్క స్పూన్ తీసుకుంటే
షుగర్‎ను కంట్రోల్ చేసే పవర్ఫుల్ మెడిసిన్.. ఒక్క స్పూన్ తీసుకుంటే