రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికిన గవర్నర్ నరసింహన్, సీఎం జగన్

రేణిగుంట: రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శనివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నారు.  విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. రేణుగుంట విమానశ్రయంలో గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, ఏపీ సీఎం జగన్‌ తదితరులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్న ఆయన అక్కడి నుంచి తిరుపతికి చేరుకుని తర్వాత తిరుచానూరు వెళతారు. పద్మావతి అమ్మవారిని దర్శించుకుని రాత్రి తిరుమల చేరుకుంటారు. ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం నెల్లూరులోని ఇస్రో కేంద్రానికి చేరుకుంటారు. […]

రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికిన గవర్నర్ నరసింహన్, సీఎం జగన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 13, 2019 | 7:19 PM

రేణిగుంట: రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శనివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నారు.  విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. రేణుగుంట విమానశ్రయంలో గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, ఏపీ సీఎం జగన్‌ తదితరులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకున్న ఆయన అక్కడి నుంచి తిరుపతికి చేరుకుని తర్వాత తిరుచానూరు వెళతారు. పద్మావతి అమ్మవారిని దర్శించుకుని రాత్రి తిరుమల చేరుకుంటారు. ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం నెల్లూరులోని ఇస్రో కేంద్రానికి చేరుకుంటారు. సోమవారం చంద్రయాన్‌-2 ప్రయోగాన్ని వీక్షించనున్నారు.