Railway Passenger Alert: శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్.. తిరుపతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు

|

Aug 08, 2022 | 3:58 PM

Tirupati Special Trains: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లొచ్చే భక్తులకు రైల్వే శాఖ మరో తీపికబురు అందించింది. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది.

Railway Passenger Alert: శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్.. తిరుపతికి మరిన్ని ప్రత్యేక రైళ్లు
Tirupati Railway Station
Follow us on

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లొచ్చే భక్తులకు రైల్వే శాఖ మరో తీపికబురు అందించింది. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్ – తిరుపతి మధ్య నాలుగు సర్వీసుల ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట్ మీదుగా నడుస్తాయి. ప్రత్యేక రైలు (నెం.07469) ఆగస్టు 11, 13 తేదీల్లో సాయంత్రం 05.50 గం.లకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07.20 గం.లకు తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అలాగే ప్రత్యేక రైలు (నెం.07470) ఆగస్టు 12, 14 తేదీల్లో రాత్రి 08.15 గం.లకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.20 గం.లకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు జనగామ, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి. ఈ రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, సెకండ్ జనరల్ క్లాస్ కోచ్‌లు ఉండనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తలు చదవండి