Andhra Pradesh: బ్యాంక్‌లో బంగారం దాచుకున్నారా..? ఈ విషయం తెలిస్తే గుండె గుభేల్..

|

Jan 26, 2023 | 8:20 AM

కాకినాడలో మరో బ్యాంకు మోసం వెలుగు చూసింది. అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసిన జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ కొన్ని నెలల క్రితమే బోర్డు తిప్పేసింది. అది మరవక ముందే సూర్యారావుపేట యూకో బ్యాంక్‌లో

Andhra Pradesh: బ్యాంక్‌లో బంగారం దాచుకున్నారా..? ఈ విషయం తెలిస్తే గుండె గుభేల్..
Bank Locker
Follow us on

కాకినాడలో మరో బ్యాంకు మోసం వెలుగు చూసింది. అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసిన జయలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్ కొన్ని నెలల క్రితమే బోర్డు తిప్పేసింది. అది మరవక ముందే సూర్యారావుపేట యూకో బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ మోసం వెలుగుచూసింది. అధికారులు లాకర్ తనిఖీల్లో లేటుగా గుర్తించారు. సిబ్బంది ఇచ్చిన కంప్లైంట్‌పై టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. యూకో బ్యాంక్‌లో పనిచేస్తున్న సిబ్బంది అసలు బంగారానికి బదులు నకిలీ బంగారాన్ని లోపల ఉంచి మోసం చేశారంటూ బాధితులు ఆందోళన చెందుతున్నారు. సుమారు 100 మంది లబోదిబోమంటున్నారు. బ్యాంకులో ఏం జరుగుతుందో తనకే తెలియదు అంటూ యూకో బ్యాంక్ మేనేజర్ చెప్తుండటం ఆశ్చర్యం కల్గిస్తోంది. పోలీసులు బ్యాంకు అప్రైజర్ నుంచి వివరాలు రాబడుతున్నారు.

అసలు బంగారాన్ని బయట ఎక్కడ తాకట్టు పెట్టారు అనే కోణంలో కూపీ లాగుతున్నారు. అసలు బంగారానికి బదులు నకిలీ బంగారాన్ని బ్యాంకులో ఉంచిన సిబ్బంది కోసం గాలిస్తున్నారు. బ్యాంక్ సిబ్బంది అసలు బంగారాన్ని బయట తాకట్టు పెట్టి కోట్ల రూపాయలు సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది.

బాధితులను బ్యాంకు మేనేజర్, పోలీసులు మేనేజ్ చేసేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. బ్యాంక్ మోసం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ఇందులో పాత్రదారులు ఎవరు? సూత్రదారులు ఎవరు? బ్యాంక్‌లో దాచుకున్న బంగారాన్నే దోచేస్తే ఎలా? ఈ కేసును పోలీసుల ఎలా చేధించబోతున్నారన్న చర్చ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..