AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్పత్రి బాత్రూమ్‌లో గర్భిణీ ప్రసవం.. బకెట్‌లో బిడ్డను వదిలి పరార్!

ఆస్పత్రికి డెలివరీకి గర్భిణీ వచ్చింది. అయితే అదే సమయంలో వైద్యులు ఆస్పత్రిలో అందుబాటులో లేరు. దీంతో గర్భిణీ బాత్రూమ్‌లో ప్రసవించింది. బాత్రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చి.. అక్కడే బకెట్‌లో వదిలివెళ్లింది. శిశువు ఏడుపును గమనించి ఆస్పత్రి సిబ్బంది గమనించి.. బాత్రూమ్‌ తలుపు తెరచి చూడగా ఒక్కసారిగా..

ఆస్పత్రి బాత్రూమ్‌లో గర్భిణీ ప్రసవం.. బకెట్‌లో బిడ్డను వదిలి పరార్!
Woman Gave Birth At Hospital Bathroom In Giddaluru
Srilakshmi C
|

Updated on: Sep 23, 2025 | 12:20 PM

Share

గిద్దలూరు, సెప్టెంబర్‌ 23: ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి డెలివరీకి గర్భిణీ వచ్చింది. అయితే అదే సమయంలో వైద్యులు ఆస్పత్రిలో అందుబాటులో లేరు. దీంతో గర్భిణీ బాత్రూమ్‌లో ప్రసవించింది. బాత్రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చి.. అక్కడే బకెట్‌లో వదిలివెళ్లింది. శిశువు ఏడుపును గమనించి ఆస్పత్రి సిబ్బంది గమనించి.. బాత్రూమ్‌ తలుపు తెరచి చూడగా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే శిశువును సంరక్షించి వైద్యులు అందుబాటులో లేకపోవడంతో మరో ఆస్పత్రికి శిశివు తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకుని సీసీటీవీలో రికార్డైన గర్భిణి ఆస్పత్రికి వస్తున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ అమానుష ఘటన ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులో వెలుగులోకి వచ్చింది.

ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఓ ప్రైవేటు వైద్యశాలలో కాన్పు కోసం వచ్చి వైద్యులు లేకపోవడంతో వాష్ రూమ్ లోనే ఓ తల్లి మగ శిశువుకు జన్మనిచ్చింది. పుట్టిన శిశువును బాత్రూమ్‌ బకెట్లో వదిలేసి వెళ్లిపోయిన తల్లి. శిశు ఏడుపు విని ఆసుపత్రి సిబ్బంది, సంరక్షించి మరో వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. కాన్పు కోసం వచ్చిన సమయంలో తల్లి మరో వ్యక్తితో పాటు కలిసి వచ్చినట్టు గుర్తించారు. సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాల ద్వారా మహిళను గుర్తించేందుకు పోలీసుల ప్రయత్నిస్తున్నారు.

పోలీసులకు ఆసుపత్రి సిబ్బంది సమాచారం ఇవ్వడంతో పోలీసులు జరిగిన ఘటనపై విచారణ చేపట్టారు. గర్భిణీ స్త్రీ వేరొక వ్యక్తితో కలిసి ఆసుపత్రికి వచ్చిన దృశ్యాలు ఆస్పత్రిలోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. గర్భిణీ డెలివరీకి వచ్చిన సమయంలో వైద్యులు ఎవరు అందుబాటులో లేరు. తర్వాత గర్భిణీ వాష్ రూమ్‌కి వెళ్లి శిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని పోలీసులు విచారణలో గుర్తించారు. శిశువు ఆరోగ్యంగా ఉందని, ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. శిశు సంరక్షణ కొరకు ఐసిడిఎస్ అధికారులకు శిశువుని అప్పగిస్తామన్నారు సీఐ సురేష్. ప్రస్తుతం తల్లిని వెతికిపట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

2026లో రాగి బంగారం అవుతుంది! పెట్టుబడి పెడితే..
2026లో రాగి బంగారం అవుతుంది! పెట్టుబడి పెడితే..
ఒకే రాయి పైకప్పుగా వేల ఇళ్లు.. ప్రకృతి వేసిన అద్భుత డిజైన్..!
ఒకే రాయి పైకప్పుగా వేల ఇళ్లు.. ప్రకృతి వేసిన అద్భుత డిజైన్..!
రైల్వే గేట్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే దూసుకొచ్చిన ట్రైన్
రైల్వే గేట్‌ను ఢీకొట్టిన వ్యాన్.. ఇంతలోనే దూసుకొచ్చిన ట్రైన్
రూ. 30 వేల జీతంతో 10 ఏళ్లలో రూ. కోటి సంపాదన.. ఎలాగంటే..
రూ. 30 వేల జీతంతో 10 ఏళ్లలో రూ. కోటి సంపాదన.. ఎలాగంటే..
బ్యాట్ పడితే పరుగులు..గిటార్ పడితే పాటలు..అదరగొట్టిన జెమీమా
బ్యాట్ పడితే పరుగులు..గిటార్ పడితే పాటలు..అదరగొట్టిన జెమీమా
సంక్రాంతికి వా వాతియార్.. రిలీజ్ ఎప్పుడంటే..
సంక్రాంతికి వా వాతియార్.. రిలీజ్ ఎప్పుడంటే..
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్‌ మెయిల్‌
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్‌ మెయిల్‌
ఆ వివాహం ఓ పీడకల.. ఆ పదం వాడకండి.. మీడియాకు మోడల్‌ విజ్ఞప్తి
ఆ వివాహం ఓ పీడకల.. ఆ పదం వాడకండి.. మీడియాకు మోడల్‌ విజ్ఞప్తి
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..ఇండియాలో ఆడాల్సిందే, లేదంటే ఇంటికే!
బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్..ఇండియాలో ఆడాల్సిందే, లేదంటే ఇంటికే!
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే