Watch Video: ఇంట్లో రాత్రిపూట అదోరకం శబ్ధాలు.. ఏంటా అని టార్చ్ వేయగా.. వామ్మో..

ముందే చలికాలం.. బయటచలి వణికిస్తుంది. ఇక అటవీ ప్రాంతం కంటే జనావాసాలైనా ఇల్లే సేఫ్ అనుకుంటున్నాయేమో గాని.. అడవిలో ఉండాల్సిన వణ్యప్రాణులు వనాలను వదిలి.. గ్రామాల్లోకి వస్తున్నాయి. తాజాగా ఓ కొండచిలువ కూడా ఇలానే అనుకున్నట్టుంది.. అందుకే అడవి వదిలి ఓ ఇంట్లోకి దూరింది. ఇంట్లో భారీ కొండచిలువను చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయంతో ఇంట్లోంచి పరుగులు పెట్టారు.

Watch Video: ఇంట్లో రాత్రిపూట అదోరకం శబ్ధాలు.. ఏంటా అని టార్చ్ వేయగా.. వామ్మో..

Edited By:

Updated on: Dec 22, 2025 | 8:06 PM

పట్టణాభివృద్ధి పేరుతో అడవులను నరికి భవనాలను నిర్మిస్తున్నారు జనాలు.. దీంతో అడవుల్లో ఉండాల్సిన వణ్యప్రాణులు వనాలు వదిలి జనావాసాల్లోకి వస్తున్నాయి. దానికి తోడు ప్రస్తుతం శీతాకాలాన్ని తట్టుకోలేక కూడా అవి వెచ్చదనం కోసం గ్రామాల్లోకి వస్తున్నాయి. తాజాగా ఇలానే
తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం తొండంబట్టు గ్రామంలోని ఓ ఇంట్లోకి 9 అడుగుల భారీ కొండ చిలువ దూరింది. రాత్రి పూట ఇంట్లో భారీ కొండచిలువను చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయపడిపోయారు. గట్టిగా కేకలు వేశారు.

కుటుంబ సభ్యుల కేకలు విన్న స్థానిక జనాలు అంతా ఇంటి దగ్గరకు చేరుకున్నారు. ఇంట్లో భారీ కొండచిలువను చూసి వెంటనే అప్రమత్తమయ్యారు.  దాన్ని పట్టుకునేందుకు చాలా సేపు ప్రయత్నించారు. కానీ అది వాళ్లకు చిక్కకుండా చుక్కలు చూపించింది. దీంతో గ్రమస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఇక వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది చాకచక్యంగా భారీ కొండచిలువను పట్టుకొని గోనే సంచిలో బందించారు. అనంతరం దాన్ని ఊరికి దూరంగా తీసుకెళ్లి అడవిలో వదిలేశారు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు స్థానిక జనాలు అంతా ఊరిపి పీల్చుకున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.