Ganta Srinivasa Rao: ఈనెల 26న విశాఖలో కాపునాడు మహాసభ.. పార్టీ మారడంపై గంటా ఏమన్నారంటే..?
పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఖండించారు. తానేమీ పార్టీ మారడం లేదని.. కావలనే ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఖండించారు. తానేమీ పార్టీ మారడం లేదని.. కావలనే ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ మారడం లాంటిది ఏమైనా ఉంటే అందరికీ చెబుతానంటూ సెటైర్లు వేశారు. తనకు సంబంధం లేకుండానే ఈ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు పార్టీలకు అతీతంగా కాపు నాడు మహాసభ ఉంటుందని గంటా శ్రీనివాసరావు తెలిపారు.
ఈ నెల 26న వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా విశాఖపట్నంలో జరగబోయే కాపునాడు మహాసభ పోస్టర్‌ను గంటా పలువురు కాపు నేతలతో కలిసి ఆవిష్కరించారు. కాపునాడు రీ ఆర్గనైజేషన్ ఒక ఆశయం కోసం పని చేస్తోందని, అదేంటో సరైన సమయంలో తెలుస్తుందని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
రాధ-రంగ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 26న విశాఖలో కాపునాడు మహాసభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో రాజకీయాలకు అతీతంగా కాపులంతా హాజరవుతారని పేర్కొన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..