Visakhapatnam: తెలంగాణ వర్సెస్ కర్నాటక.. ఫైనల్ కు వెళ్లేదెవరు.. రసవత్తరంగా మారనున్న మ్యాచ్..
విశాఖపట్నంలో దివ్యాంగుల క్రికెట్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. గీతం యూనివర్సిటీ క్రికెట్ స్టేడియంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో ఈ పోటీలు...
విశాఖపట్నంలో దివ్యాంగుల క్రికెట్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. గీతం యూనివర్సిటీ క్రికెట్ స్టేడియంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. వీల్ ఛైర్ క్రికెట్ కప్ పోటీల్లో అన్ని జట్టు పాల్గొని సత్తా చాటుతున్నాయి. గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు ఎం.శ్రీ భరత్ పోటీలు ప్రారంభించారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల నుంచి 120 మందికి పైగా దివ్యాంగ క్రికెటర్లు హాజరయ్యారు. దివ్యాంగుల్లో క్రీడా స్ఫూర్తి నింపడానికి ఈ పోటీలు ఉపయోగపడతాయని నిర్వాహకులు తెలిపారు. క్రికెట్‌లో తమకు సాటిలేదనేంతగా దివ్యాంగులు ప్రతిభను చాటుతున్నారు. వీల్ చైర్‌లో కూర్చుని బౌలింగ్, బ్యాటింగ్, కీపింగ్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పోటీల్లో రెండో రోజు జరిగిన ఆంధ్ర, తెలంగాణ మ్యాచ్ లో ఆంధ్రప్రదేశ్ జట్టు విజయం సాధించింది.
పోటీల్లో భాగంగా తొలి రోజు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. వాతావరణం కారణంగా 18 ఓవర్ల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో కర్నాటక 188/6 చేయగా.. ఆంధ్రప్రదేశ్ 133/2 కు పరిమితమైంది. 39 బంతుల్లో 78 పరుగులు చేసిన సాగర్ లామినిని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ప్రకటించారు. తానా స్పోర్ట్స్ కోఆర్డినేటర్, ఏపీ వీల్ చైర్ క్రికెట్ బోర్డు సభ్యులు శశాంక్ యార్లగడ్డ కర్ణాటక జట్టును అభినందించారు. దక్షిణ భారతదేశంలో జరుగుతున్న మొట్టమొదటి వీల్ చైర్ క్రికెట్ కప్ ఇదే నన్న శశాంక్.. ఇది చాలా సంతోషించవలసిన విషయమని చెప్పారు.\
టోర్నమెంట్ లో భాగంగా చివరి రోజు (డిసెంబర్ 12) న కర్ణాటక వర్సెస్ తెలంగాణ మధ్య మ్యాచ్ జరగనుంది. మరోవైపు.. ఫైనల్స్ 20 ఓవర్లు ఉంటాయన్న నిర్వాహకులు.. ఉదయం 10.30కు మొదటి జట్టు బ్యాటింగ్, మధ్యాహ్నం భోజనం తర్వాత రెండో బ్యాటింగ్ చేస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి ముగింపు కార్యక్రమం జరగనుంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..