Watch: అనంత పద్మనాభస్వామి అవతారంలో వినాయకుడు.. ఎక్కడో కాదు మన దగ్గరే.. వీడియో
పార్వతీపురం మన్యం జిల్లాలో ఏర్పాటుచేసిన అనంత పద్మనాభస్వామి గణనాధుడు విగ్రహం అందరినీ ఆకర్షిస్తుంది. పార్వతీపురం పట్టణంలోని మోటుపర్తి వారి వీధిలో గణేశ నవరాత్రి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. కమిటీ సభ్యులు ఈ ఏడాది వినూత్న ఆలోచనతో అనంత పద్మనాభ స్వామి రూపంలో గణపయ్యను ప్రతిష్టించారు.

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏర్పాటుచేసిన అనంత పద్మనాభస్వామి గణనాధుడు విగ్రహం అందరినీ ఆకర్షిస్తుంది. పార్వతీపురం పట్టణంలోని మోటుపర్తి వారి వీధిలో గణేశ నవరాత్రి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. కమిటీ సభ్యులు ఈ ఏడాది వినూత్న ఆలోచనతో అనంత పద్మనాభ స్వామి రూపంలో గణపయ్యను ప్రతిష్టించారు. పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్న నేలమాలిగల నమూనాను ప్రతిబింబించేలా మండపాన్ని తీర్చిదిద్దారు. ఆరు గదుల ఆకృతిలో మండపం నిర్మాణం చేసి, ఒక గదిలో నాగబంధం బిగించారు. మిగతా గదుల్లో వజ్రాలు, వైడూర్యాలు, బంగారు ఆభరణాల రూపకల్పనతో ఆకట్టుకునేలా అలంకరించారు. విశిష్టమైన రూపంలో దర్శనమిస్తున్న అనంత పద్మనాభ స్వామి గణపయ్యను చూడటానికి స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.
వీడియో చూడండి..
అనంత పద్మనాభస్వామి గణపయ్య విగ్రహం దగ్గర భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. గణనాథుడి విభిన్న రూపం భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తుతోంది. కమిటీ సభ్యులు తయారు చేసిన ఈ వినూత్న మండపం, గణపయ్య ప్రతిష్ట స్థానికులకు ఆకర్షణగా నిలిచింది. భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ విభిన్న రూపంలోని గణపయ్యను చూడటమే తమ అదృష్టంగా భావిస్తున్నారు భక్తులు. ఇప్పటివరకు ఎన్నో రూపాల్లో గణనాథుడిని చూశాం, కానీ ఈసారి ఇలాంటి పద్మనాభ స్వామి రూపంలో చూడటం ఒక అపూర్వ అనుభూతి అని అంటున్నారు భక్తులు. ఈ ప్రత్యేక గణపయ్య ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాకే విశేష ఆకర్షణగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
