AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: అంత చిన్న మాటకు ఇంత దారుణంగా కొట్టారేంట్రా.. బీరు బాటిళ్లతో దాడికి అదేకారణం!

గాజువాకలో అర్థరాత్రి అల్లరిమూకల వీరంగం సృష్టించారు. తమ ఇంటి ముందు గొడవ పడకుండా దూరంటా వెళ్లాలని సూచించిన వ్యక్తిపై బీర్‌ సీసాలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో సదురు వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు 11 మంది యువకులను అదుపుతోకి తీసుకున్నారు.

Andhra News: అంత చిన్న మాటకు ఇంత దారుణంగా కొట్టారేంట్రా.. బీరు బాటిళ్లతో దాడికి అదేకారణం!
Gajuvaka
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Jul 16, 2025 | 3:02 PM

Share

గాజువాకలో అల్లరిమూకల వీరంగం ఘటనలో 11 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అర్ధరాత్రి పూట ఇంటి ఎదుట ఘర్షణ పడుతున్న యువకుల్ని మందలించినందుకు ఇంటి యజమానిపై బీరుసీసాలతో దాడి చేసినట్టు గుర్తించారు. బాధ్యులైన 11 మందిపై కేసు నమోదు చేసి పదిమందిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాకలోని బీసీసీ రోడ్డులో జీవన్‌ కుమార్ అనే వ్యక్తం నివాసం ఉంటున్నారు. సోమవారం అర్థరాత్రి సింహగిరికాలనీ, అజీమాబాద్ ప్రాంతాలకు చెందిన కొందరు యువకులు ఒకచోట చేరి మద్యం సేవించారు. ఆ తర్వాత జీవన్‌కుమార్ ఇంటిముందుకు రాగానే వారిలో వారే మద్యం మత్తులో గొడవపడ్డారు.

తమ ఇంటిముందు జరుగుతున్న గొడవను గమనించిన జీవన కుమార్ ‘ఇక్కడ గొడవ పడకండి. మీ ఇళ్లకు వెళ్లిపోండి సదురు యువకులను సూచించాడు. దీంతో ఆగ్రహించిన అప్పల రాజు, వెంకట రమణ , షేక్ బషీర్, మోహన్ కార్తీక్‌లు ఆయన ఇంటి గేటుపైకి ఎక్కి లోపలకు చొరబడ్డారు. పూల కుండీలను ధ్వంసం చేశారు. పై ఫ్లోర్‌లో నివాసం ఉంటున్న జీవన్ కిందకు వచ్చి ప్రశ్నించే సరికి అతని తలపై అప్పలరాజు బీరుసీసాతో దాడి చేశాడు. మరి కొంతమంది సహకరించారు. యువకుల దాడిలో జీవన్‌కుమార్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు.

దీంతో రాజీవ్‌కుమార్ కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే గాజువాకలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రాజీవ్‌ కుమార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక రాజీవ్‌ కుటుంబ సభ్యులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి పాల్పడిన మొత్తం 11 మందిలో 10 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఇందులో 8 మందిని.. కోర్టు ఆదేశాలతో జైలుకు, మరో ఇద్దరిని జువైనల్ హోమ్‌కు తరలించారు. మరో నింతుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.