AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది సార్ మన రేంజ్.. అందాల లక్క బొమ్మలకు మరో అరుదైన గౌరవం..

అందానికి, కళాకారుల నైపుణ్యానికి పేరొందిన ఎలమంచిలి ఏటికొప్పాక లక్కబొమ్మలకూ మరో ఘనత దక్కింది. తన ప్రత్యేకతతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ బొమ్మలు.. మరో అవార్డును సొంతం చేసుకున్నాయి. న్యూఢిల్లీ లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన 'ఒక జిల్లా - ఒక ఉత్పత్తి అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఏటికొప్పాక లక్కబొమ్మలు ఎంపికయ్యాయి.

ఇది సార్ మన రేంజ్.. అందాల లక్క బొమ్మలకు మరో అరుదైన గౌరవం..
Etikoppaka Wooden Toys
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Jul 16, 2025 | 4:06 PM

Share

అందానికి, కళాకారుల నైపుణ్యానికి పేరొందిన ఎలమంచిలి ఏటికొప్పాక లక్కబొమ్మలకూ మరో ఘనత దక్కింది. తన ప్రత్యేకతతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ బొమ్మలు.. మరో అవార్డును సొంతం చేసుకున్నాయి. న్యూఢిల్లీ లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ‘ఒక జిల్లా – ఒక ఉత్పత్తి అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఏటికొప్పాక లక్కబొమ్మలు ఎంపికయ్యాయి. లక్క బొమ్మలకు అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక ప్రసిద్ది.. ఇక్కడ ఈ కళాకారుల చేతుల్లో జీవం పోసుకుంటున్న ఈ లక్క బొమ్మలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఎన్నో అవార్డులు వచ్చాయి. ఈ వృత్తిపైనే ఆ గ్రామస్తులు చాలామంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. బొమ్మలకు ప్రాణం పోసి పొట్ట నింపుకుంటున్నారు అక్కడి కళాకారులు..

ఇటీవల రిపబ్లిక్ డే వేడుకల్లోనూ.. ఏడు కొప్పాక బొమ్మల శకటం సత్తా చాటింది. ఈసారి ‘ఒక జిల్లా – ఒక ఉత్పత్తి అవార్డు కు ఎంపికై జిల్లాకు అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లక్క బొమ్మలకు మరో గౌరవం దక్కింది.

Etikoppaka Wooden Toys Wins Prestigious Award

Etikoppaka Wooden Toys Wins Prestigious Award

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్త చేతులు మీదుగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఇప్పటికే.. గుర్తింపు పొందిన ఏటికొప్పాక లక్కబొమ్మలు జాతీయ స్థాయిలో మరో గుర్తింపు పొందాయని కలెక్టర్ పేర్కొన్నారు. అవార్డుతో లక్కబొమ్మల ఖ్యాతి మరింత పెరుగుతుందని తెలిపారు. మన లక్క బొమ్మలకు మరింత ఖ్యాతి రావాలని ఆకాంక్షించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
కొవ్వు కరగాల్సిందే.. కండరాలు పెంచాల్సిందే.. లేకపోతే మెదడు..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
ఓలా, ఉబర్‌కు పోటీగా ఏపీ ప్రభుత్వం కొత్త యాప్.. తక్కువ ధరకే..
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
భయపెట్టే ఘోర యాక్సిడెంట్.. చూస్తే షాకే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
వరల్డ్ కప్ జట్టు నుంచి గిల్ అవుట్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలివే
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
విన్నర్ అవ్వాల్సినోడు టాప్-3లోనూ లేకుండా..ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్
వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..
వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు..
పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా
పొలంలోకి వెళ్లి కళ్లు తేలేసిన పోలీసులు.. వీడియో చూశారా
తెలంగాణలో మరో ఎన్నికలు.. త్వరలోనే షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికలు.. త్వరలోనే షెడ్యూల్..!
శ్రీలంక అమ్మాయిలకు వైజాగ్‎లో చుక్కలు చూపించడం పక్కా భయ్యా
శ్రీలంక అమ్మాయిలకు వైజాగ్‎లో చుక్కలు చూపించడం పక్కా భయ్యా
సిబిల్ స్కోర్ తక్కువుందా.. 500 నుంచి 750కి పెరగాలంటే ఇలా చేస్తే.
సిబిల్ స్కోర్ తక్కువుందా.. 500 నుంచి 750కి పెరగాలంటే ఇలా చేస్తే.