ముంచేశాడు.. మలేషియాలో ఉద్యోగాల పేరుతో మోసం.. 15 మంది నుంచి లక్షలు వసూలు

| Edited By: Jyothi Gadda

Sep 04, 2023 | 3:00 PM

దేశంలో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసం చేయడం ఇప్పటివరకూ చూశాం. ప్రభుత్వ, ప్రవేటు ఉద్యోగాల పేరుతో అనేక రకాల మోసాలు చేసే వాళ్లను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనలు విన్నాం. అయితే ఏకంగా మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఏకంగా ఎనభై లక్షలు వసూలు చేసిన మోసగాడిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ముంచేశాడు.. మలేషియాలో ఉద్యోగాల పేరుతో మోసం.. 15 మంది నుంచి లక్షలు వసూలు
Malaysian Jobs Cheating
Follow us on

గుంటూరు, సెప్టెంబర్ 04: దేశంలో ఉద్యోగాలిప్పిస్తామంటూ మోసం చేయడం ఇప్పటివరకూ చూశాం. ప్రభుత్వ, ప్రవేటు ఉద్యోగాల పేరుతో అనేక రకాల మోసాలు చేసే వాళ్లను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనలు విన్నాం. అయితే ఏకంగా మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఏకంగా ఎనభై లక్షలు వసూలు చేసిన మోసగాడిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డొకిపర్రుకు చెందిన తోట బ్రహ్మానందం మలేసియాలో ఉద్యోగం చేస్తున్నాడు. కొద్దీ కాలం కిందట గుంటూరుకు వచ్చినప్పడు స్నేహితులతో మాట్లాడుతూ మలేషియాలో ఉద్యోగాలున్నాయని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లు వస్తే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. అప్పటి నుండి మేడికొండూరు మండలంలో ఒక్కొక్కరి వద్ద నుండి నాలుగు లక్షల రూపాయల చొప్పున మొత్తం పదిహేను మంది నుండి డబ్బులు వసూలు చేశాడు.

అదే విధంగా అతని స్నేహితుడు తురకపాలెంకు చెందిన సుభాన్ కు కన్సల్టెన్సీ ఇప్పిస్తానని నమ్మబలికాడు. అందుకు ఇరవై లక్షల రూపాయలు అవుతుందని చెప్పి ఆ డబ్బులు తీసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ యువకుల్ని మలేషియా పంపించాడు. ఆరు నెలల వీసాపై మలేషియా వెళ్లిన ఒకరి ఉద్యోగం రాగా మరొకరికి ఉద్యోగమే లేదు. వచ్చిన ఉద్యోగానికి కూడా జీతం లేదు. దీంతో వారిద్దరూ మోసం పోయామని తెలిసింది. అదే సమయంలో ఆరు నెలలు గడచి పోవడంతో స్థానికులకు సాయంతో ఆ ఇద్దరూ యువకులు స్వగ్రామం చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి

దీంతో బ్రహ్మానందం మోసం చేసినట్లు స్థానిక యువకులకు తెలిసి పోయింది. ఈ క్రమంలోనే తమ డబ్బులు తమకు ఇవ్వాలంటూ బ్రహ్మానందాన్ని ఒత్తిడి చేశారు. అయితే తనకు ఎటువంటి సంబంధం లేదని ఇష్టం వచ్చినట్లు చేసుకోండని బ్రహ్మానందం దురుసుగా మాట్లాడాడు. దీంతో బాధితులందరూ స్పందనలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే బ్రహ్మానందం మలేషియాలో ఉండటంతో ఏంచేయాలో అర్దం కావటం లేదని బాధితులు వాపోయారు.

టి నాగరాజు, స్పెషల్ కరస్పాండెంట్, టివి9, గుంటూరు.