AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో భగవంతుడా.. మంచినీటి కోసం చేయి పెడితే.. ప్రాణమే పోయింది..!

పద్నాలుగేళ్ల బాలుడు.. ఆరో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు. చలాకీగా గ్రామంలో తిరుగుతూ అందరితో కలివిడిగా ఉండేవాడు. టిఫిన్ కోసం గ్రామంలోని ఓ షాపు వద్దకు వెళ్ళాడు. అక్కడ టిఫిన్ తీసుకుని.. మంచినీరు తాగేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలోనే..

అయ్యో భగవంతుడా.. మంచినీటి కోసం చేయి పెడితే.. ప్రాణమే పోయింది..!
Drinking Water Bottile
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: May 21, 2025 | 2:35 PM

Share

పద్నాలుగేళ్ల బాలుడు.. ఆరో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు. చలాకీగా గ్రామంలో తిరుగుతూ అందరితో కలివిడిగా ఉండేవాడు. టిఫిన్ కోసం గ్రామంలోని ఓ షాపు వద్దకు వెళ్ళాడు. అక్కడ టిఫిన్ తీసుకుని.. మంచినీరు తాగేందుకు సిద్ధమయ్యాడు. పక్కనే ఉన్న కిరాణా షాప్ లోని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి బాటిల్‌ను తీయబోయాడు. అంతలోనే అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఏం జరిగిందో చూసేలోపే ప్రాణాలు కోల్పోయాడు.

విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం పొడుగుపాలెం దొంతలవారి కళ్లాలో ఈ ఘటన జరిగింది. రెడ్డి శివ లక్ష్మీ దంపతులకు ఇద్దరు పిల్లలు. వారిలో 14 ఏళ్ల దశ్వంత్, 12 ఏళ్ల సంజయ్ ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో ఇద్దరు చిన్నారులు ఇంటి దగ్గరే ఉంటున్నారు. చందక కూడలిలో టిఫిన్ కోసం వెళ్లాడు దశ్వంత్. ఆ తరువాత తాగునీటి కోసం టిఫిన్ సెంటర్ పక్కనే ఉన్న కిరాణా దుకాణానికి వెళ్ళాడు. అక్కడ ఫ్రిజ్ తెరిచాడు. అంతే..! విద్యుత్ షాక్ తో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అది గమనించిన ఓ మహిళ వెళ్లి కాపాడే ప్రయత్నం చేసింది. ఆమె కూడా ప్రమాదానికి గురైంది. వెంటనే మరో మహిళ ఫ్రిడ్జ్ కు విద్యుత్ సరఫరా అయ్యే మెయిన్ ఆపడంతో.. మహిళ ప్రాణాలు దక్కాయి.

అప్పటికే కుప్పకూలిపోయిన దశ్వంత్‌ను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. గత రెండు మూడు రోజులుగా కురిసిన వర్షానికి ఎర్త్ తప్పి.. ఫ్రిజ్ కు విద్యుత్ వ్యాపించి ఉంటుందని అనుమానిస్తున్నారు. బాలుడి తండ్రి రెడ్డి శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు ఆనందపురం పోలీసులు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారిస్తున్నామన్నట్లు సిఐ వాసు నాయుడు తెలిపారు. చలాకీగా కళ్ళ ముందు కనిపించే బాలుడు దస్వంత్ విగత జీవిగా మారేసరికి ఆ కుటుంబం కన్నీరుగా విలపిస్తోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..