Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Chandrababu: జూన్ 21న ఏపీలో ఒక చరిత్ర సృష్టించబోతున్నాం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

CM Chandrababu: జూన్ 21న ఏపీలో ఒక చరిత్ర సృష్టించబోతున్నాం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

Anand T

|

Updated on: May 21, 2025 | 5:16 PM

ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న గొప్ప వరం యోగా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని.. యోగాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని నరేంద్రమోదీకే దక్కుతుందన్నారు. జూన్ 21న విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని చెప్పారు.

జూన్ 21న ఆంధ్రప్రదేశ్‌లో ఒక చరిత్ర సృష్టించబోతున్నాం అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లిలో ‘యోగాంధ్ర’ వెబ్‌సైట్‌ను ప్రారంభించి ఆయన ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్పవరం యోగా అని ఆయన అన్నారు. యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని సీఎం తెలిపారు. నేడు ప్రపంచంలో అన్ని దేశాల్లో జరుపుకునే కార్యక్రమం యోగా అని తెలిపారు. జూన్ 21న విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకూ 5 లక్షల మందితో యోగా డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అన్నారు. ఇది ఒక ప్రపంచ రికార్డు కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్లమంది యోగాలో పాల్గొనేలా సంకల్పించామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారని చెప్పారు.

Published on: May 21, 2025 05:13 PM