Srikakulam: ఉపాధి హామీ కూలీలపై దూసుకెళ్లిన లారీ.. నలుగురు మహిళలు దుర్మరణం..

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆముదాలవలస మండాది వద్ద ఉపాధి హామీ కూలీలపై నుంచి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. . ఒకరి పరిస్థితి విషమంగా ఉంది....మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Srikakulam: ఉపాధి హామీ కూలీలపై దూసుకెళ్లిన లారీ.. నలుగురు మహిళలు దుర్మరణం..
Accident
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 04, 2023 | 5:31 PM

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆముదాలవలస మండాది వద్ద ఉపాధి హామీ కూలీలపై నుంచి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. . ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే అలర్ట్ అయిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. వారు స్పాట్ కు చేరుకున్నారు. అక్కడే ఉన్న లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై వివరాలు సేకరిస్తున్నారు.

బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెబుతున్నాడు. ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో జరిగిన ఈ దుర్ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకుకున్నాయి. మృతుల కుటుంబీకుల రోదనలతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..