Andhra Pradesh: చేపల వేటకు వెళ్లి.. నలుగురు మత్స్యకారులు గల్లంతు.. గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు

ఐదు రోజుల కిందట వేటకు వెళ్లిన జాలర్లు తిరిగి రాలేదు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మత్స్యకారులు కృష్ణా జిల్లాకు చెందిన వారీగా గుర్తించారు.

Andhra Pradesh: చేపల వేటకు వెళ్లి.. నలుగురు మత్స్యకారులు గల్లంతు.. గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు
Fishermen Missing

Edited By: Ravi Kiran

Updated on: Jul 05, 2022 | 11:52 AM

Andhra Pradesh: బంగాళాఖాతంలో వేటకు వెళ్లి నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ ఘటన కోనసీమ జిల్లా అంతర్వేదిలో ( Bay of Bengal at Antarvedi) చోటు చేసుకుంది. ఐదు రోజుల కిందట వేటకు వెళ్లిన జాలర్లు తిరిగి రాలేదు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మత్స్యకారులు కృష్ణా జిల్లాకు చెందిన వారీగా గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే..

మచిలీపట్నం క్యాంప్ బెల్ పేట గ్రామానికి చెందిన మత్యకారులు ఐదు రోజుల క్రితం అంతర్వేది సముద్రం లోకి వేటకు వెళ్లారు.  ఆదివారం కుటుంబ సభ్యులు మత్యకారులను సమాచారం అడుగగా.. తాము దగ్గరలో ఉన్నామని  బోట్ ఇంజిన్ పాడైందని చెప్పారు. తమ దగ్గర ఉన్న ఒక్క ఫోన్  స్విచ్ఛాఫ్ అవుతుందని చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇప్పటి వరకూ ఆచూకీ లభ్యం కాలేదని బాధితు కుంటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గల్లంతైన పడవలో  మత్స్యకారులు విశ్వనాథపల్లి చినమస్తాన్(55), రామాని నాంచార్లు(55), చెక్క నరసింహారావు (50), మోకా వెంకటేశ్వరరావు (35)లు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. మత్యకారుల ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి