Eluru: ఆపినా ఆగని స్విఫ్ట్ కారు.. అనుమానమొచ్చి ఆపి చెక్ చేయగా.. లోపలున్నవి చూసి

తుని టూ హైదరాబాద్.. వయా రాజమండ్రి.. చెక్‌పోస్ట్ మీదుగా ఓ కారు దూసుకోస్తోంది. సరిగ్గా చెక్‌పోస్టు రాగానే దాన్ని వదిలేసి పరార్ అయ్యారు. ఇంతకీ ఆ కారులో ఏమున్నాయో తెలిస్తే దెబ్బకు షాక్ అవుతారు. మరి అదేటంటే.. ఈ వార్త చూసేయండి.

Eluru: ఆపినా ఆగని స్విఫ్ట్ కారు.. అనుమానమొచ్చి ఆపి చెక్ చేయగా.. లోపలున్నవి చూసి
Representative Image

Edited By:

Updated on: Jun 03, 2025 | 10:16 AM

సొంతంగా కారు ఉంటే ఫ్యామిలీ, పిల్లలతో కలసి సరదాగా టూర్ వెళ్లి వస్తారు. ఇంటికి కావాల్సిన సరుకులు, వస్తువులు అందులోనే తెచ్చుకుంటారు. ఇక నేరగాళ్లు అయితే స్మగ్లింగ్ చేయటానికి వాడతారు. కానీ ఫస్ట్ టైం కారులో దూడలను కుక్కి ట్రాన్స్‌పోర్ట్ చేస్తూ ఒక వ్యక్తి పోలీసులకు చిక్కాడు. అవేమైనా కుక్కపిల్లలా.. అలా ఎలా తీసుకెళ్తారు. ఏమాత్రం జాలీ కనికరం లేకుండా పోయిందా అని దాన్ని చూసిన కొందరు నొచ్చుకుని.. పోలీసులకు సమాచారం ఇవ్వటంతో గుట్టు రట్టయింది. ఐసర్ వ్యాన్, లారీలు వీటిలో తరలిస్తుంటే గో సంరక్షణ సంఘాలు, పోలీసులు అడ్డుకోవడంతో అతడు తెలివిగా కారును దూడల రవాణాకు ఎంచుకున్నాడు. ఒకట్రెండు కాదు ఏకంగా నాలుగు దూడలు కారు వెనుక ఎక్కించాడు.

అత్యంత అమానవీయంగా కారులో గోవులను కుక్కి రవాణా చేస్తున్న వైనం కొవ్వూరులో వెలుగు చూసింది. కారు వెనుక సీటులో నాలుగు గిత్తలను కుక్కి హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ తరలిస్తుండగా పోలీసులకు సమాచారం రావడంతో తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గామన్ బ్రిడ్జ్‌పై కారును అదుపులోకి తీసుకున్నారు. తుని నుంచి వీటిని హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు గుర్తించారు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు దూడలను గోశాలకు పంపారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి సీఐ విశ్వం దర్యాప్తు చేస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..