Nellore: ‘వేరే మతాన్ని గౌరవిస్తే తప్పా.. మందు తాగానా, మాంసం తిన్నానా..’ ఎమ్మెల్యే అనిల్ ఫైర్

అయ్యప్ప మాల ధారణతో నమాజ్ టోపి ధరించకూడదని ఏ శాస్త్రం చెబుతుంది.. అయ్యప్ప దీక్షలోనే హిందూ ముస్లిం భాయ్.. భాయ్ అనేది ఉందని ఎమ్మెల్యే అనిల్ కౌంటరిచ్చారు.

Nellore: 'వేరే మతాన్ని గౌరవిస్తే తప్పా.. మందు తాగానా, మాంసం తిన్నానా..' ఎమ్మెల్యే అనిల్ ఫైర్
YSR Congress MLA Anil Kumar Yadav
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 26, 2022 | 7:00 PM

మాంసం తిన్నానా? మందు తాగానా? వేరే మతాన్ని గౌరవిస్తే తప్పెలా అవుతుంది ఇదే మాటలతో కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్‌. ఆయన అయ్యప్ప మాల వేసుకుని ఓ మసీదులోకి వెళ్లడం, అక్కడే ముస్లింటోపీ ధరించి తర్వాత అదే ప్రాంతంలో అదే వేషధారణతో తిరగడంపై శుక్రవారం బీజేవైఎం కార్యకర్తలు నిరనస తెలిపారు. అనిల్ ఇంటి ముందు ధర్నా చేశారు. రాళ్లతో దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు.

ఈ వివాదం తర్వాత బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమువీర్రాజు కూడా స్పందించారు. అనిల్ చేసింది తప్పని, ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తం ఈ వ్యవహారంపై కౌంటర్ ఇచ్చిన అనిల్‌.. నిరసన చేస్తున్న నేతలకు కనీసం అయ్యప్ప మాల అంటే తెలుసా అని ప్రశ్నించారు. మందుతాగానా, మాంసం తిన్నానా అంటూ ప్రశ్నించారు. వేరే మతాన్ని గౌరవిస్తే తప్పెలా అవుతుందో చెప్పాలన్నారు.

శబరిమల వెళ్లే అయ్యప్ప మాలధారులు, ముస్లిం అయిన వావర్‌ స్వామిని దర్శించి అయ్యప్ప దర్శనానికి వెళతారు. అది బీజేపీ నేతలకు తెలీదా అన్నారు అనిల్‌. నెల్లూరు రొట్టెల పండగకు ఎంతమంది హిందువులు రావడంలేదు.. అజ్మీర్ దర్గాకు ఎంతమంది హిందువులు వెళ్లడంలేదు అంటూ ప్రశ్నించారు అనిల్‌. మతంతో రాజకీయం చేసే తీరు తనది కాదన్నారు. అయ్యప్ప మాలలో ఉండి.. నమాజ్ టోపి పెట్టుకోకూడదు అని శాస్త్రం ఉంటే తెలపాలని అనిల్ బీజేపీ నాయకులకు ఛాలెంజ్ చేశారు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేది అయ్యప్ప దీక్షలోనే ఉందన్నారు. తాను చేసింది తప్పు కాదని సమాజానికి తెలుసన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..