Nallari Kiran Kumar: బీజేపీలోకి నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డి.. ఢిల్లీ అగ్రనేతలతో చర్చలు.. జాతీయ స్థాయిలో కీలక పదవీ?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా అజ్ఞాతం వీడబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌కు రాజీనామా చెయ్యాల్సి ఉన్నా..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా అజ్ఞాతం వీడబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌కు రాజీనామా చెయ్యాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల అది మరో రెండు రోజులకు వాయిదా పడింది. బహుశా ఎల్లుండో, ఆ మరుసటి రోజో ఆయన కాంగ్రెస్‌కు బైబై చెప్పి.. బీజేపీ అగ్రనేతల సమక్షంలో బీజేపీలో చేరొచ్చు. అందుకు ముందు మీడియాతోనూ మాట్లాడే చాన్స్ ఉంది.
కాగా, దీంతో బీజేపీలో చేరికకు నల్లారి కిరణ్ లైన్ క్లియర్ అయినట్లయింది. నల్లారి కిరణ్ ఉమ్మడి ఏపీకి చివరి సీఎంగా పనిచేశారు. రాష్ట్ర విభజనపై యూపీఏ నిర్ణయాన్ని వ్యతిరేకించిన కిరణ్‌కుమార్.. అప్పట్లో సీఎం పోస్ట్‌కి, కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత సమైక్యాంధ్ర పార్టీ పెట్టిన కిరణ్‌కుమార్.. 2014లో ఘోరపరాజయం తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లారు. కాంగ్రెస్‌లో చేరినా పార్టీ వ్యవహారాలకు అంటీముట్టనట్లుగానే ఉన్నారు. కొన్నేళ్లుగా పూర్తి రాజకీయ అజ్ఞాతంలోనే ఉండిపోయారు. ఇకపై బీజేపీలోకి వెళ్లి జాతీయస్థాయిలో కీరోల్ పోషించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి