వినాయక చవితి ఎఫెక్ట్.. భారీగా పెరిగిన పూల అమ్మకాలు.. ఇప్పటి నుంచే ప్రీ బుకింగ్స్..

| Edited By: శివలీల గోపి తుల్వా

Sep 15, 2023 | 10:48 AM

Vijayawada: మొన్నటి వరకు శ్రావణ మాసం కావడంతో .. ఆత్యధికంగా వివాహాది శుభకార్యాలు జరిగాయి.. ఈ నేపథ్యంలో పూల వ్యాపారం బాగానే సాగింది.. వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. ఆ సమయం ఇప్పుడు ఇలా ముంగిసిందో లేదో.. వినాయక చవితి పండుగ రానుండటంతో పూలకు మళ్లీ భారీ డిమాండ్ ఏర్పడింది. మరో వైపు గణేష్ మండపాలను ప్రత్యేకంగా పూలతో అలంకరించేందుకు మండపాల కమిటీ సభ్యులు..

వినాయక చవితి ఎఫెక్ట్.. భారీగా పెరిగిన పూల అమ్మకాలు.. ఇప్పటి నుంచే ప్రీ బుకింగ్స్..
Kaleswara Rao Market, Vijayawada
Follow us on

విజయవాడ, సెప్టెంబర్ 15: వినాయక చవితి సందర్భంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా.. నూతన పండుగ శోభ కనిపిస్తుంది. నగరాల్లోనే కాకుండా పల్లె ప్రాంతాల్లో కూడా అత్యధికంగా వినాయక చవితి పర్వదినం సందర్భంగా మండపాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల గణనాధుని విగ్రహాలను కొనుగోలు చేసిన కమిటీ సభ్యులు వాటిని మండపాలకు తరలించే పనుల్లో నిమగ్నమయ్యారు. వినాయక చవితి రాక ముందే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పండుగ శోభ సంతరించుకుంది. వినాయక చవితి పండగ నేపథ్యంలో మార్కెట్లో వ్యాపారాలు స్పీడ్ అందుకున్నాయి. ఇదే సమయంలో పూజల కోసం ఉపయోగించే పూల అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి.

విజయవాడ కాళేశ్వరావు మార్కెట్ లో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పూల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మొన్నటి వరకు శ్రావణ మాసం కావడంతో .. ఆత్యధికంగా వివాహాది శుభకార్యాలు జరిగాయి.. ఈ నేపథ్యంలో పూల వ్యాపారం బాగానే సాగింది.. వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. ఆ సమయం ఇప్పుడు ఇలా ముంగిసిందో లేదో.. వినాయక చవితి పండుగ రానుండటంతో పూలకు మళ్లీ భారీ డిమాండ్ ఏర్పడింది. మరో వైపు గణేష్ మండపాలను ప్రత్యేకంగా పూలతో అలంకరించేందుకు మండపాల కమిటీ సభ్యులు పూల వ్యాపారులకు అడ్వాన్సు కూడా చెల్లిస్తున్నారని చెబుతున్నారు..

అంతే కాదు, వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని తమకు తగిన కూలి సైతం అందుతుందని.. రోజుకు 500 రూపాయల నుండి 1000 రూపాయలు వరకు సంపాదిస్తున్నామని పూల వ్యాపారులు చెప్తున్నారు. వరుస పండగలు వస్తుండటంతో తమ వ్యాపారాలు బాగున్నాయని ఆనందం వ్య్వక్తం చేస్తున్నారు.. పండుగ రాక మునుపే వ్యాపారాలు ఊపందుకోవడంతో విజయవాడలోని పలువురు పూల వ్యాపారులు అడ్డర్‌లు బుక్ చేస్తున్నారు.. పెద్ద పూల దండల నుంచి చిన్న చిన్న దండల వరకు కొనుగోలు అయ్యే అవకాశాలు అధికమైన నేపథ్యంలో తాము బెంగుళూరు, హైదరాబాదు నుండి పూలను దిగుమతి చేసుకున్నట్లుగా కొందరు పూల వ్యాపారులు తెలిపారు. పూల ధరలు సైతం యధా స్థితిలో ఉండడంతో, పూల ధరలలో ఎటువంటి మార్పు రాలేదని, వినాయక చవితి పర్వదినం సందర్భంగా జరిగే పూల కొనుగోళ్లపై తాము ఆశాజనకంగా ఉన్నామన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..